ప్ర‌ముఖ న‌టుడు నానా ప‌టేక‌ర్ క‌న్నుమూత

ABN , Publish Date - Oct 08 , 2026 | 07:47 AM

ప్ర‌ముఖ బాలీవుడ్‌, మ‌రాఠీ న‌టుడు, నిర్మాత నానా ప‌టేక‌ర్ (76) (Nana Patekar) క‌న్నుమూశారు.

Nana Patekar

ప్ర‌ముఖ బాలీవుడ్‌, మ‌రాఠీ న‌టుడు, నిర్మాత నానా ప‌టేక‌ర్ (75) (Nana Patekar) క‌న్నుమూశారు. ఓ చిత్రం షూటింగ్ విష‌యంలో గోవాలో ఉన్న ఆయ‌న‌కు ఈ తెల్ల‌వారుజామున 5.20 గంట‌ల స‌మ‌యంలో గుండెపోటు రావ‌డంతో స‌న్నిహితులు హుటాహుటిన స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా వైద్యులు 45 నిమిషాల పాటు సీపీఆర్ చేసినప్ప‌టికీ ఆయ‌న‌ను బ‌తికించ‌లేక పోయారు. ఈ ఘ‌ట‌న‌పై మెడికో-లీగల్ కేసు (MLC) నమోదు అయింద‌ని పోస్ట్‌మార్టం నిర్వహిస్తుంచ‌నున్న‌ట్లు మణిపాల్ హాస్పిటల్ చీఫ్ ఆఫ్ ఆంకాలజీ విభాగం డాక్టర్ శేఖర్ సల్కర్ తెలిపారు.

ఈ వార్త తెలిసి భార‌తీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ ఒక్కసారిగా షాక్ గుర‌యింది. ముఖ్యంగా నానా పటేకర్ మరణవార్తతో హిందీ, మరాఠీ సినీ పరిశ్రమల్లో విషాదం నెలకొంది. తన విలక్షణమైన నటన, శక్తివంతమైన సంభాషణలతో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించిన ఆయన.. ఎన్నో గుర్తుండిపోయే పాత్రల్లో నటించారు. 'పరిందా', 'క్రాంతివీర్', 'అబ్ తక్ ఛప్పన్', 'వెల్‌కమ్' వంటి చిత్రాల ద్వారా ఆయన దేశవ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్నారు. నానా పటేకర్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Oct 08 , 2026 | 08:07 AM