యాంకర్ ఫొటోలు మార్ఫింగ్.. అసభ్యకర పోస్టులు
ABN , Publish Date - Oct 08 , 2026 | 07:23 AM
హైదరాబాద్‌లో ఓ ఛానెల్ యాంకర్, ఆమె సోదరి ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
యాంకర్ పాటు ఆమె సోదరి ఫొటోలను అసభ్యకరంగా మార్చింగ్ చేసి (Anchor Harassment) సోషల్ మీడియాలో పోస్టు చేయడమే కాకుండా గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. బంజారాహిల్స్ (Banjara Hills) రోడ్డునెంబర్ 12లో ఓ ఛానెల్ యాంకర్ నివసిస్తోంది.
అయితే.. కొన్ని రోజులుగా పలువురు ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఐడీలను సృష్టించి యాంకర్, ఆమె సోదరి సోషల్ మీడియా ఖాతాల నుంచి ఫొటోలను సేకరించారు. వాటిని అసభ్యకరమైన రీతిలో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడం ప్రారంభించారు.
అంతేకాకుండా.. బాధితుల బంధువులు, పరిచయస్తులకు, పాలోవర్లకు రిక్వెస్టులు పంపుతూ వీడియోలను బహిర్గతం చేస్తామంటూ బెదిరింపులకు గురిచేయడం మొదలు పెట్టారు. బాధితురాలు తొలుత షీ టీమ్స్ ను ఆశ్రయించారు. అనంతరం ఆధారాలతో బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.