సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

విజయ్, శౌర్యువ్ ప్రాజెక్ట్.. ‘ధట్స్ ఏ రోర్’ లిరికల్ వీడియో చూశారా!

ABN, Publish Date - Apr 19 , 2026 | 08:55 PM

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, ‘హాయ్ నాన్న’ ఫేమ్ డైరెక్టర్ శౌర్యువ్ కాంబినేషన్‌లో హ్యూజ్ గ్లోబల్ ప్రాజెక్ట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మేకర్స్ మరో సర్‌ప్రైజ్ ఇచ్చారు.

Shouryuv Vijay Movie Update

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), ‘హాయ్ నాన్న’ ఫేమ్ డైరెక్టర్ శౌర్యువ్ (Director Shouryuv) కాంబినేషన్‌లో హ్యూజ్ గ్లోబల్ ప్రాజెక్ట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌‌పై కొన్ని రోజులుగా వార్తలు అయితే వినిపించాయి కానీ, అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. సడెన్‌గా మేకర్స్ ఈ ప్రకటనతో సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇంటర్నేషల్ టెక్నీషియన్స్ ఈ మూవీకి వర్క్ చేస్తుండగా.. వైరా బ్యానర్ నిర్మిస్తోంది. ఈ ప్రెస్టీజియస్ మూవీకి సంబంధించిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఇంకా వైరల్ అవుతుండగానే మేకర్స్ మరో సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమాలోని విజయ్ దేవరకొండ చేస్తున్న పాత్రను ఎలివేట్ చేస్తూ, ‘ధట్స్ ఏ రోర్’ (That’s a Roar Lyrical Video) అంటూ ఓ ర్యాప్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో విజయ్ దేవరకొండ ఒక పవర్ ఫుల్, ఎనర్జిటిక్ లుక్‌లో కనిపిస్తున్నారు.


ఈ పాట సాహిత్యం అంతా.. హీరో తనకున్న కష్టాలను, అవమానాలను ఎదుర్కొని.. ఎలా విజయం వైపు అడుగులు వేస్తున్నాడో తెలిపేలా ఉంది. విజయ్ దేవరకొండ బ్లాక్ డాగ్స్‌తో చాలా స్టైలిష్‌గా, పవర్ ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇంగ్లీష్‌లో ఉన్న ఈ ర్యాప్.. కేవలం పాట మాత్రమే అని చెప్పుకోలేం.. స్ఫూర్తినిచ్చే సాహిత్యంతో.. హీరో పాత్రకు ఉన్న ఎమోషన్స్, పోరాటాన్ని తెలిపే ఒక గర్జన అని చెప్పుకోవచ్చు.ఈ పాటలో హీరో తన బాధను ఎలా శక్తిగా మలుచుకుంటున్నాడో, ఎవరిని అడగకుండా సొంతంగా ఎలా ఎదిగాడో చెబుతున్నారు. ఈ పాట చూస్తుంటే, ఈ సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో తెలుస్తోంది. విజయ్ కోసం దర్శకుడు శౌర్యువ్ ఓ అద్భుతమైన కథని సిద్ధం చేసినట్లుగా అయితే ఈ పాట క్లారిటీ ఇస్తోంది. ఈ సినిమాకు హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేస్తున్నట్లుగా ఇప్పటికే చిత్రబృందం తెలియజేసింది.

ఇవి కూడా చదవండి:

సబ్‌స్క్రిప్షన్ వార్తలపై అనన్య నాగళ్ల క్లారిటీ ఇదే!

SIFPA: ఏకపక్ష నిర్ణయాలకు చెక్.. సినీ పరిశ్రమను కాపాడుకునే దిశగా నిర్మాతలు!

Raasi: మహేష్ ‘నిజం’ సినిమాలోని పాత్రపై రాశి షాకింగ్ కామెంట్స్!

పెళ్లికి సిద్ధమైన శృతిహాసన్.. ఆ లక్కీ వరుడు ఎవరో?

Updated Date - Apr 19 , 2026 | 08:55 PM