పెళ్లికి సిద్ధమైన శృతిహాసన్.. ఆ లక్కీ వరుడు ఎవరో?
ABN , Publish Date - Apr 18 , 2026 | 04:19 PM
లోకనాయకుడు కమల్ హాసన్ గారాలపట్టి శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటనతోనే కాకుండా తన గాత్రంతోనూ కుర్రకారును ఉర్రూతలూగించే ఈ మల్టీ టాలెంటెడ్ బ్యూటీ.. ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.
లోకనాయకుడు కమల్ హాసన్ గారాలపట్టి శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటనతోనే కాకుండా తన గాత్రంతోనూ కుర్రకారును ఉర్రూతలూగించే ఈ మల్టీ టాలెంటెడ్ బ్యూటీ.. ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. గత కొంతకాలంగా కెరీర్ మీద ఫుల్ ఫోకస్ పెట్టిన శృతి.. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుందనే వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తోంది. అసలు శృతిహాసన్ కోసం కమల్ హాసన్ చూస్తున్న ఆ వరుడు ఎవరు? ఈ వార్తల్లో నిజమెంత? అనేది మాత్రం, అధికారికంగా తెలియాల్సి ఉంది.
కెరీర్ ఆరంభం నుంచే శృతిహాసన్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. కేవలం కమల్ హాసన్ కుమార్తెగానే కాకుండా, తన స్టామినా ఏంటో మొదటి సినిమాతోనే నిరూపించుకుంది. అయితే.. ఈ అమ్మడు సినిమాలతో ఎంత పాపులర్ అయిందో, తన వ్యక్తిగత విషయాలతోనూ అంతే చర్చల్లో నిలిచింది. ముఖ్యంగా శృతిహాసన్ లవ్ ఎఫైర్స్ నెట్టింట ఎప్పుడూ సెన్సేషనే. తొలుత లండన్ బేస్డ్ ఆర్టిస్ట్ మైఖెల్ కోర్సలేతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది ఈ భామ. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారని ఇండస్ట్రీలో గట్టిగా వినిపించింది. అయితే, ఊహించని విధంగా వీరి బంధానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత ముంబైకి చెందిన శాంతను హజారికతోనూ శృతి క్లోజ్‌గా మూవ్ అయింది. వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యేవి. కానీ, ఈ ప్రేమాయణం కూడా మూణ్ణాళ్ల ముచ్చటగానే ముగిసిపోవడం అభిమానులను సైతం విస్మయానికి గురిచేసింది.
ప్రేమలో ఎదురుదెబ్బలు తగిలినా.. శృతిహాసన్ ఎక్కడా తగ్గలేదు. తన కెరీర్ మీద దృష్టి సారించి వరుస ప్రాజెక్టులతో బిజీ అయింది. రీసెంట్‌గా ‘వారణాసి’ సినిమాలో ఆమె పాడిన ‘సంచారి సాంగ్’ గ్లోబల్ వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేయడంతో, శృతి రేంజ్ ఇంటర్నేషనల్ లెవల్‌కు చేరింది. ఇలా కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్‌లో ఉన్న ఈ అమ్మడి విషయంలో ఇప్పుడు తండ్రి కమల్ హాసన్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కూతురి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న కమల్.. ఈసారి ఎలాగైనా ఆమెకు పెళ్లి చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యారట. ఇప్పటికే శృతి కోసం పెళ్లి చూపులు కూడా మొదలయ్యాయని సమాచారం. గతంలో కొన్ని సంబంధాలను చూసినా, అవి వర్కౌట్ కాలేదు. అయితే, ఈసారి కమల్ హాసన్ తనకు బాగా తెలిసిన వారికే ఎక్కువ ప్రయారిటీని ఇస్తున్నట్లు తెలుస్తోంది. శృతి కూడా తండ్రి నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ టాక్. ఈ ఏడాది టాలీవుడ్‌లో వరుసగా సెలబ్రిటీలు పెళ్లి పీటలెక్కుతూ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోయిన్లు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఇదే బాటలో ఇప్పుడు శృతిహాసన్ కూడా చేరుతుందేమో చూడాలి. మరి శృతి కోసం కమల్ హాసన్ సెలక్ట్ చేసే ఆ లక్కీ వరుడు ఎలా ఉండబోతున్నాడనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే!
ఇవి కూడా చదవండి:
విష్ణుప్రియ దారిలోనే మరికొందరు.. ఆ కంటెంట్ కావాలంటే సబ్‌స్క్రైబ్ అవ్వాల్సిందే.
మంగ్లీ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్.. అసలు కథ ఇప్పుడే మొదలైంది!
Balakrishna: ‘రూటు’ మార్చిన బాలయ్య.. కొడుకు కథను పక్కన పెట్టి.. తనే ఆ దర్శకుడితో?