‘వీరభద్రుడు’.. అన్నపూర్ణ స్టూడియోస్ ఆట మొదలైంది

ABN , Publish Date - May 10 , 2026 | 03:39 PM

తెలుగు చలనచిత్ర పంపిణీ రంగంలో దశాబ్దాలుగా సాగుతున్న ఆధిపత్యానికి సవాల్ విసిరేలా ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్ ప్రకటన నిలిచింది. ప్రకటనకే పరిమితం కాకుండా.. ఈ సంస్థ ఆట కూడా ఆరంభించింది.

Suriya in Veerabhadrudu

తెలుగు చలనచిత్ర పంపిణీ రంగంలో దశాబ్దాలుగా సాగుతున్న ఆధిపత్యానికి సవాల్ విసిరేలా ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్ ప్రకటన నిలిచిందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios) డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి ఎంట్రీ ఇవ్వడం వెనుక పెద్ద స్కెచ్చే ఉందనేలా కూడా వార్తలు వచ్చాయి. మొదట్లో అన్నపూర్ణ స్టూడియోస్ సినిమాల నిర్మాణంతో పాటు, తమ సొంత సినిమాలను పంపిణీ చేసుకునేది. ఇటీవలే పూర్తిస్థాయి డిస్ట్రిబ్యూషన్ హౌస్‌గా రంగంలోకి దిగుతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. ప్రకటనే కాదు.. ఆట కూడా మొదలైంది. అవును, సూర్య (Suriya) నటిస్తోన్న మాగ్నమోపస్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘వీరభద్రుడు’ (Veerabhadrudu) చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్ డిస్ట్రిబ్యూషన్‌లో విడుదలకాబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.


ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించడం ద్వారా పేరును తెచ్చుకున్న నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో 2026 మే 14న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. తమిళం, తెలుగు, హిందీ పరిశ్రమలలో పాపులర్ కంటెంట్‌ను అందించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని స్కేల్, కంటెంట్ రెండింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రతిష్టాత్మకగా తెరకెక్కిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఆ విషయాన్ని తెలియజేసింది. కచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని చిత్రయూనిట్ ఎంతో నమ్మకంగా ఉంది.


స్టార్ హీరో సూర్య సరసన త్రిష (Trisha) నటించిన ఈ చిత్రంలో ఇంద్రన్స్, నట్టి, స్వసిక, అనఘ, మాయ రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రంపై సూర్య కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే, ఆయనకు హిట్ వచ్చి చాలా కాలం అవుతుంది. ఈ సినిమాపై సూర్య కూడా బంపర్ హిట్ అందుకుంటాడని, సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతగానో వేచి చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

‘అండర్‌ రేటెడ్‌’ నటిగా చూస్తున్నారా? పాయల్ రాజ్‌ఫుత్‌ సమాధానమిదే!

Raghava Theater: ఈ థియేటర్‌లో ఫస్ట్, లాస్ట్ సినిమా ఎన్టీఆర్‌దే.. భావోద్వేగంలో ఫ్యాన్స్!

త్రిష లేకుంటే విజయ్ జాతకం మరోలా ఉండేది- వేణు స్వామి

Ranabaali: హార్స్ రైడింగ్ గ్లింప్స్.. విజయ్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్!

Updated Date - May 10 , 2026 | 03:39 PM

Karuppu: త్రిషకు అవమానం.. పట్టించుకోని సూర్య

Karuppu: బ‌ర్త్ డే స్పెష‌ల్.. సూర్య కరుప్పు లుక్ వ‌చ్చేసింది

Annapurna Studios: ఎ ఎన్నార్‌ వర్చువల్‌ ప్రొడక్షన్‌ స్టేజ్‌.. సినిమా మేకింగ్ ఇక మరింత సులభతరం

Karuppu: సూర్య డ్యూయల్ షేడ్స్.. కరుప్పు టీజర్‌లో మాస్ ఫీస్ట్!

Karuppu: సూర్య ఫ్యాన్స్ కు షాక్.. కరుప్పు డైరెక్ట్ ఓటీటీకే