Karuppu: త్రిషకు అవమానం.. పట్టించుకోని సూర్య

ABN , Publish Date - May 02 , 2026 | 04:23 PM

స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ (Trisha Krishnan) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ లో అయితే ప్రస్తుతం ఆమె పేరే ట్రెండింగ్ గా మారింది.

Trisha

Karuppu: స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ (Trisha Krishnan) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ లో అయితే ప్రస్తుతం ఆమె పేరే ట్రెండింగ్ గా మారింది. తాజాగా ఆమె నటిస్తోన్న చిత్రాల్లో కరుప్పు (Karuppu) ఒకటి. సూర్య (Suriya) హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తోన్నారు. తెలుగులో వీరభద్రుడు అనే పేరుతో రిలీజ్ కానుంది. ఇప్పటికే కరుప్పు నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా కరుప్పు చిత్రం నుంచి త్రిష లుక్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రీతీ అనే పాత్రలో ఆమె నటిస్తున్నట్లు తెలిపారు.


త్రిష కరుప్పు లో లాయర్ గా కనిపించనుంది. మునుపటి కంటే యంగ్ గా ఎంతో అందంగా ఆమె కనిపించారు. ఇక త్రిష లుక్ చూసిన ఒక అభిమాని త్రిషనా ఆమె ఈ సినిమాలో ఉన్నారా.. ? అస్సలు గుర్తుపట్టలేకపోయాను. ఆమె ఏజ్ రివర్స్ లో వెళ్తోంది అని కామెంట్ చేయగా దానికి త్రిష తనదైన రీతిలో సమాధానం చెప్పారు. 'ధన్యవాదాలు.. నేనే మర్చిపోయాను. కనీసం ఇప్పుడైనా వాళ్ళు రిమైండర్ పెట్టుకున్నారని తెలిసి సంతోషంగా ఉంది' అని తెలిపారు. దానికి మరో అభిమాని.. ' ఆడియో ఫంక్షన్ కి రాలేదు కానీ..ఇంత వెటకారం అవసరమా' అని అడగ్గా త్రిష.. తనను అసలు ఆడియో ఫంక్షన్ కి పిలవలేదని చెప్పారు.


సినిమాకు హీరో ఎంతనో.. హీరోయిన్ కూడా అంతే. అలాంటిది హీరోయిన్ ని పిలవకపోవడంపై త్రిష అభిమానులు ఫైర్ అవుతున్నారు. సూర్య కూడా దీనిపై స్పందించలేదని, ఒక హీరోయిన్ కి ఇది అవమానమేనని చెప్పుకొస్తున్నారు. నిజంగానే హీరోయిన్నీ మర్చిపోయారా.. ? లేక త్రిషను పిలవడం మంచిది కాదు అనుకున్నారా.. ? అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దళపతి విజయ్ విడాకులకు త్రిషనే కారణమని వార్తలు వస్తోనే ఉన్నాయి. ఇప్పుడు త్రిష ఈ ఫంక్షన్ కి వస్తే లేనిపోని రభస జరుగుతోందని భావించి కరుప్పు టీమ్ త్రిషను పిలవలేదని కొందరు చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజముంది అనేది తెలియాల్సి ఉంది.

Updated Date - May 02 , 2026 | 05:23 PM