Karuppu: సూర్య డ్యూయల్ షేడ్స్.. కరుప్పు టీజర్‌లో మాస్ ఫీస్ట్!
ABN , Publish Date - Jul 23 , 2025 | 10:33 AM
కొలీవుడ్ స్టార్ హీరో సూర్య, త్రిష జంటగా తమిళంలో రూపొందుతున్న చిత్రం కరుప్పు. దీపావళికి ప్రేక్షకుల థియేటర్లకు రానుంది.
కొలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya), త్రిష (Trish) జంటగా తమిళంలో రూపొందుతున్న చిత్రం కరుప్పు (Karuppu). దీపావళికి ప్రేక్షకుల థియేటర్లకు రానుంది. ఈ రోజు (జూలై, 23) సూర్య జన్మదినాన్ని పురస్కరించుకుని మేకర్స్ తమిళంతో పాటు అన్ని భాషల్లో టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్‌ను పరిశీలిస్తే సూర్య ఈ చిత్రంలో రెండు రకాల షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తోన్నట్లు తెలుస్తోంది. టీజర్‌లో సూర్య కొత్త లుక్, యాక్షన్ సీక్వెన్స్‌లు, డ్యూయల్ షేడ్స్ ఫ్యాన్స్‌ని ఫుల్ ఎక్సైటెడ్ చేశాయి. గతంలో నయనతారతో ముక్కు పుడక అమ్మోరు తల్లి అనే చిత్రాన్ని రూపొందించిన ఆర్జే బాలాజీ (RJ Balaji) దర్శకత్వం వహిస్తున్నాడు.