Karuppu: బర్త్ డే స్పెషల్.. సూర్య కరుప్పు లుక్ వచ్చేసింది
ABN , Publish Date - Jul 22 , 2025 | 09:11 PM
ఎప్పటికప్పుడు విభిన్న కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాడు కొలీవుడ్ స్టార్ హీరో సూర్య.
కొలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) ఎప్పటికప్పుడు విభిన్న కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాడు. ఆయన నటించిన జై భీమ్, సూరరై పోట్రు లాంటి చిత్రాలు క్రిటికల్‌గా మరియు కమర్షియల్‌గా భారీ విజయం సాధించాయి. ఇప్పుడు అదే రేంజ్‌లో మరొక పవర్‌ఫుల్ ప్రాజెక్ట్‌తో సూర్య సిద్ధమవుతున్నాడు. ఆ సినిమా పేరు కరుప్పు (Karuppu). త్రిష (Trish) కథానాయికగా నటిస్తోండగా ప్రముఖ నటుడు, నయనతారతో అమ్మోరు తల్లి అనే చిత్రాన్ని రూపొందించిన ఆర్జే బాలాజీ (RJ Balaji) దర్శకత్వం వహిస్తున్నాడు.
తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఓ అప్డేట్ ఇచ్చారు. జూలై 23 సూర్య జన్మదినాన్ని పురస్కరించుకుని సిఇనమా పేరును కురుప్పుగా ప్రకటించడంతో పాటు సూర్యలుక్‌ను రిలీజ్ చేశారు. అంతేగాక సినిమా టీజర్‌ను బుధవారం రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా వదిలిన లుక్‌లో సూర్య పూర్తి రగ్డ్, రౌడీ లుక్‌లో కనిపించగా. ఫ్యాన్స్ ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. కరుప్పు అనే పదానికి తమిళంలో నలుపు లేదా డార్క్ అనే అర్థం వస్తుంది. ఈ టైటిల్ ద్వారా కథలో ఇంటెన్స్ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది.
కరుప్పు దేవత కాన్సెప్ట్ ఆధారంగా గ్రామీణ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమా, రివెంజ్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. కాగా సినిమాలో.. సూర్య ఒక గ్రామీణ నాయకుడిగా, న్యాయం కోసం పోరాడే మాస్ హీరోగా కనిపించనున్నాడు. 2025 చివరి నాటికి ఈ సినిమా థియేటర్లలో విడుదల అయ్యే అవకాశం ఉంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీలోనూ ఈ మూవీ రిలీజ్ అవుతుందని సమాచారం.