సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Varanasi: ‘వారణాసి’ కోసం మైత్రీ వేట.. టెంప్టింగ్ ఆఫర్‌!

ABN, Publish Date - May 15 , 2026 | 04:34 PM

తెలుగు సినిమా అంటే ఒకప్పుడు ప్రాంతీయ భాషా చిత్రం. కానీ నేడు అది గ్లోబల్ సినిమా! ఈ అద్భుతాన్ని సాకారం చేసిన ఘనత దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళికే దక్కుతుంది. ఇప్పుడాయన నుంచి రాబోతున్న ‘వారణాసి’ కోసం ప్రపంచమే ఎదురుచూస్తోంది.

Huge Offer to Varanasi From Mythri

తెలుగు సినిమా అంటే ఒకప్పుడు ప్రాంతీయ భాషా చిత్రం. కానీ నేడు అది గ్లోబల్ సినిమా! ఈ అద్భుతాన్ని సాకారం చేసిన ఘనత దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళికే దక్కుతుంది. ‘బాహుబలి’ (Baahubali) నుంచి ‘ఆర్ఆర్ఆర్’ (RRR) వరకు ఆయన వేసిన ప్రతి అడుగు ఒక చరిత్ర. ఇప్పుడు అదే పరంపరలో సూపర్‌స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu)తో రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కిస్తున్న విజువల్ వండర్ ‘వారణాసి’ (Varanasi). దాదాపు రూ. 1400 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా గురించి ఒక సంచలన వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అదే ఈ సినిమా బిజినెస్ వార్!


గత ఏడాది విడుదలైన ప్రీ-గ్లింప్స్ చూశాక, ఈ సినిమా హాలీవుడ్ రేంజ్‌లో ఉండబోతుందని అందరికీ అర్థమైంది. అందుకే ఈ ప్రాజెక్ట్ కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఎండలను కూడా లెక్కచేయకుండా రాజమౌళి ఈ సినిమా షూటింగ్‌ను పరుగులు పెట్టిస్తున్నారు. ఆగస్ట్ నాటికి గుమ్మడికాయ కొట్టేసి, ఆ తర్వాత సుదీర్ఘమైన పోస్ట్ ప్రొడక్షన్, అంతర్జాతీయ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించాలని జక్కన్న టీమ్ పక్కా ప్లాన్‌తో ఉంది. కేవలం ఇండియాలోనే కాదు, గ్లోబల్ మార్కెట్‌లో ఈ సినిమా ప్రకంపనలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే.. వారణాసి బిజినెస్ ఆఫర్స్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ కోసం బడా నిర్మాతల మధ్య ఒక మినీ యుద్ధమే జరుగుతోంది. ఈ రేసులో టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ అందరి కంటే ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం. రాజమౌళి గత చిత్రాల ట్రాక్ రికార్డు చూస్తే, పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభాలు రావడం ఖాయం. అందుకే ‘వారణాసి’ రైట్స్ దక్కించుకోవడానికి మైత్రీ నిర్మాతలు ఊహించని రేంజ్‌లో భారీ ఆఫర్‌ను యూనిట్ ముందు ఉంచారట. మరి జక్కన్న ఈ టెంప్టింగ్ ఆఫర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.


శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. అంతేకాదు, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో పవర్‌ఫుల్ నెగిటివ్ రోల్‌లో కనిపించబోతున్నారు. మహేష్ బాబు మునుపెన్నడూ లేని విధంగా ఒక కొత్త లుక్ అండ్ మేనరిజంతో ప్రపంచ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. మరి మైత్రీ మూవీ మేకర్స్ ఆఫర్‌పై రాజమౌళి నిర్ణయం ఎలా ఉండబోతుందనేది చూడాలి.

ఇవి కూడా చదవండి:

Tom Cruise: తెలుగు యువ దర్శకుడితో టామ్ క్రూజ్ భారీ చిత్రం!

Tollywood: డూప్లికేట్ జుత్తు, పాము.. సునీల్ నారంగ్ వర్సెస్ నాగవంశీ!

నిన్న ఆలీ.. నేడు రాజీవ్ కనకాల.. ఇలాంటి ఇబ్బందులు తప్పవు మరి!

ట్రెండింగ్‌లో మహేష్ బాబు కొడుకు పాట.. హిట్టు కొడుతున్నట్టేనా?

Updated Date - May 15 , 2026 | 04:34 PM