ట్రెండింగ్‌లో మహేష్ బాబు కొడుకు పాట.. హిట్టు కొడుతున్నట్టేనా?
ABN, Publish Date - May 14 , 2026 | 12:45 PM
సూపర్ స్టార్ కృష్ణ మనవడిగా, మహేష్ బాబు అన్న కొడుకుగా భారీ అంచనాల మధ్య ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు జయకృష్ణ ఘట్టమనేని. ఆయన హీరోగా పరిచయమౌతోన్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ నుంచి సెకండ్ సాంగ్ ‘మంగా మంగా’ విడుదలైంది.
సూపర్ స్టార్ కృష్ణ మనవడిగా, మహేష్ బాబు అన్న కొడుకుగా భారీ అంచనాల మధ్య ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు జయకృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni). ఆయన హీరోగా పరిచయమౌతోన్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ (Srinavasa Mangapuram). ‘ఆర్ఎక్స్ 100’, ‘మంగళవారం’ వంటి విభిన్న చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న క్రియేటివ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే.. కచ్చితంగా జయకృష్ణ.. ఫస్ట్ సినిమాతోనే బాక్సాఫీస్‌పై భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా కనిపిస్తున్నారు. తన స్టన్నింగ్ లుక్స్, ఆకట్టుకునే బేస్ వాయిస్‌తో ఇప్పటికే మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేశారు. వైలెంట్ రొమాంటిక్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. ఆ అంచనాలకు అనుగుణంగానే ప్రమోషనల్ కంటెంట్‌ని మేకర్స్ దింపుతున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ‘మంగా మంగా’ సాంగ్ (Manga Manga song)ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ సాంగ్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ సాంగ్ విడుదలైన కొన్ని గంటల్లోనే వన్ మిలియన్‌కు పైగా వ్యూస్ రాబట్టి.. సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన తొలి సింగిల్ ‘అలెల్లే అలెల్లే’.. కేవలం రెండు వారాల్లోనే 4.6 మిలియన్ వ్యూస్ సాధించి ట్రెండింగ్ హిట్‌గా నిలిచింది. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి లాంచ్ చేసిన సెకండ్ సాంగ్ కూడా చార్ట్‌బస్టర్ దిశగా దూసుకెళుతోంది. దర్శకుడు అజయ్ భూపతి విజన్‌కు తగ్గట్టుగా ఈ పాట యూత్‌ఫుల్ ఎనర్జీతో, సినిమాకి మరింత కలర్ తీసుకొచ్చింది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ జివి ప్రకాశ్ కుమార్ ఈ పాటకు అద్భుతమైన ట్యూన్ అందించారు.
ఎల్.వి. రేవంత్ ఆలపించిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ట్యూన్ ఎంతో క్యాచీగా ఉండటంతో పాటు లీడ్ పెయిర్‌ను చాలా చార్మింగ్‌గా ఈ పాట ప్రెజెంట్ చేస్తోంది. పర్కషన్ బీట్స్, వాడిన వాద్యాలు ఈ పాటను మరింత ఎనర్జిటిక్‌గా, ఫన్‌గా మార్చాయి. జయకృష్ణ, రాషా మధ్య కనిపించే స్పార్క్లింగ్ కెమిస్ట్రీ ఈ పాటకు చక్కని అందాన్ని తీసుకొచ్చింది. ఈ చిత్రంతో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని (Rasha Thadani) తెలుగు తెరకు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. లెజెండరీ నిర్మాత అశ్వినీ దత్ సమర్పణలో, జెమినీ కిరణ్ తన ‘చందమామ కథలు’ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
పరిష్కారం కోసమా? పరువు తీసుకోవడానికా?.. ఇండస్ట్రీ రచ్చపై మధుర శ్రీధర్
అప్పుడు ‘హరి హర వీరమల్లు’కి.. ఇప్పుడు ‘పెద్ది’కి! - మైత్రీ రవిశంకర్
Prabhas: ‘బాహుబలి’ ప్రభాస్ చేసిన ఈ పని తెలిస్తే.. ఫ్యాన్ అయిపోవాల్సిందే!
రాజీనామా.. నట్టి కుమార్ సంచలన నిర్ణయం
Updated at - May 14 , 2026 | 12:45 PM