Varanasi: వారణాసిలో.. మహేశ్‌కు తండ్రి ఎవరంటే?
ABN , Publish Date - Dec 15 , 2025 | 09:49 PM
మహేష్ బాబు హీరోగా ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'వారణాసి’. ఇటీవల టైటిల్ గ్లింప్స్ విడుదల చేసిన సినిమాపై రెట్టింపు అంచనాలు పెంచేశారు.
మహేష్ బాబు (mahesh babu) హీరోగా ఎస్‌ఎస్ రాజమౌళి (SS rajamouli) దర్శకత్వం వహిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'వారణాసి’ (Varanasi) ఇటీవల టైటిల్ గ్లింప్స్ విడుదల చేసిన సినిమాపై రెట్టింపు అంచనాలు పెంచేశారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. 2027లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో మహేశ్ రాముడిగా, రుద్రుడిగా కనిపించనున్న సంగతి తెలిసిందే! ఇవి కాకుండా మరో మూడు పాత్రలుఉంటాయని టాక్. అవేంటి అన్నది ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు. ఈ మధ్యనే మహేశ్‌పై కీలక సన్నివేశాలు తెరకెక్కించారని తెలిసింది.
ఆయనతోపాటు ఇందులో ప్రియాంక చోప్రా,, పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఇంతకు మించి ఈ చిత్రంలో ఇంకెవరు నటిస్తున్నారో రివీల్ చేయలేదు. అయితే తమిళ నటుడు మాదవన్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారని, ఇందులో ఆయన హనుమంతుడిగా కనిపిస్తారని టాక్ నడుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వార్త వైరల్ అవుతోంది.
ఇందులో మరో కీలక పాత్ర కోసం విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్(Prakashraj) ని తీసుకొన్నట్టు ఇన్‌సైడ్ వర్గాలు చెబుతున్నారు. మహేష్ తండ్రిగా ప్రకాష్ రాజ్ కనిపించబోతున్నారని సమాచారం. ఇటీవల వారణాసి సెట్లో ప్రకాష్ రాజ్ అడుగుపెట్టారని, ఆయనపై కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నట్టు కూడా టాక్ నడుస్తోంది. ఇంతకు ముందు ఒకరిద్దరు నటులపై టెస్ట్‌షూట్ చేశారట. కానీ రాజమౌళికి అసంతృప్తిగా అనిపించడంతో చివరికి ఆ పాత్ర ప్రకాశ్‌రాజ్‌ని వరించిందని తెలిసింది.