Tollywood: డూప్లికేట్ జుత్తు, పాము.. సునీల్ నారంగ్ వర్సెస్ నాగవంశీ!
ABN , Publish Date - May 14 , 2026 | 02:50 PM
టాలీవుడ్‌లో ఎగ్జిబిటర్స్, నిర్మాతల మధ్య హాట్ హాట్‌గా కామెంట్స్ నడుస్తున్నాయి. ఇది ఇండస్ట్రీ సమస్యపై అనుకుంటే, అది కాస్తా వ్యక్తిగతంగా మారుతూ.. టాలీవుడ్‌లో నిర్మాతలు ఇంత చీప్‌గా బిహేవ్ చేస్తారా? అనుకునే స్థాయికి చేరింది.
టాలీవుడ్‌లో ఎగ్జిబిటర్స్, నిర్మాతల మధ్య హాట్ హాట్‌గా కామెంట్స్ నడుస్తున్నాయి. ఇది ఇండస్ట్రీ సమస్యపై అనుకుంటే, అది కాస్తా వ్యక్తిగతంగా మారుతూ.. టాలీవుడ్ (Tollywood)లో నిర్మాతలు ఇంత చీప్‌గా బిహేవ్ చేస్తారా? అనుకునే స్థాయికి చేరింది. అవును, బుధవారం ఎగ్జిబిటర్లు మీడియా సమావేశం నిర్వహించి, పర్సంటేజ్ విధానం కంపల్సరీ అంటూ వారి వెర్షన్ వినిపించారు. ఇదంతా సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ కోసం జరుగుతున్న వ్యవహారమే. కానీ, సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఆదాయం రాకుండా చేస్తున్న వ్యక్తి.. వాటి గురించి మాట్లాడటం హాస్యాస్పదం అంటూ ఎగ్జిబిటర్స్ మీటింగ్‌పై గురువారం నిర్మాతలు ఏర్పాటు చేసిన సమావేశంలో నాగవంశీ (Naga Vamsi), మైత్రీ రవి (Mythri Ravi) సంచలన కామెంట్స్ చేశారు.
నిర్మాతల మీడియా సమావేశంలో టార్గెట్ అయిన పర్సన్ మరెవరో కాదు.. ఏషియన్ సినిమాస్ నిర్మాత సునీల్ నారంగ్ (Suniel Narang). ఆయనకు 300కి పైగా మల్టీప్లెక్స్ థియేటర్లు ఉన్నాయని, ఆయన సింగిల్ స్క్రీన్ థియేటర్ల గురించి మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉందని నాగవంశీ తప్పుబట్టారు. ఆయన పేరు ప్రస్తావించలేదు కానీ, ‘ఎక్కడ స్థలం దొరికితే అక్కడ.. ఆఖరికి బీ, సీ సెంటర్స్‌లో కూడా మల్టీప్లెక్సులు నిర్మించి.. సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఆదాయం రాకుండా చేస్తున్న వ్యక్తి.. ఇలా సింగిల్ స్క్రీన్ల గురించి మాట్లాడుతుంటే నవ్వు వస్తోంది’ అంటూ నాగవంశీ ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలను నిర్మాత సునీల్ నారంగ్ సీరియస్‌గా తీసుకున్నారు.
నిర్మాతల మీడియా సమావేశం ముగిసిన కొన్ని గంటలలోనే నాగవంశీకి ఆయన కౌంటర్ ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారం సునీల్ నారంగ్ వర్సెస్ నాగవంశీ అన్నట్లుగా మారిపోయింది. టాలీవుడ్ సమస్యను పక్కనపెట్టి.. ఇప్పుడు వ్యక్తిగత దూషణలకు దిగేలా ఈ వ్యవహారం మరింత హీటెక్కింది. నాగవంశీకి కౌంటర్ ఇస్తూ.. బాడీ షేమింగ్ తరహాలో సునీల్ నారంగ్ రియాక్ట్ అయ్యారు. ‘క్యా నామ్ హై బేటా... స్పెక్ట్స్ పెట్టుకొని.. బోడి తల, డూప్లికేట్ హెయిర్ పెట్టుకుని ఉంటాడు.. పాము.. సారీ నాగవంశీ’ అంటూ సునీల్ నారంగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతూ.. ఈ వివాదాన్ని మరింత ముదిరేలా చేస్తున్నాయి. మరీ ఇంత వ్యక్తిగతంగా ఈ వ్యవహారాన్ని తీసుకుంటారని ఎవరూ ఊహించి ఉండరు.
ఇక తనపై చేసిన విమర్శలకు సమాధానమిస్తూ.. తెలంగాణలో తనకు 33 సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయని, మరో 10 సింగిల్ స్క్రీన్ థియేటర్స్ నిర్మాణ దశలో ఉంటే.. మరో 15 బుకింగ్ ప్రక్రియ జరుగుతుందని సునీల్ నారంగ్ వెల్లడించారు. మల్టీప్లెక్స్ థియేటర్స్ మాత్రమే కాదు.. సింగిల్ స్క్రీన్ల అభివృద్ధిలోనూ తాము కీలక పాత్ర పోషిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. భారత్‌లో 500కు పైగా థియేటర్లను నిర్మించాలనే భారీ లక్ష్యంతో వెళుతున్నామని తెలిపారు. మొత్తంగా అయితే, ఈ వ్యవహారం ఇప్పటిలో ఓ కొలిక్కి వచ్చేలా అయితే కనిపించడం లేదు. అలాగే, సునీల్ నారంగ్ వ్యాఖ్యలపై నాగవంశీ ఎలా రియాక్ట్ అవుతారనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి:
నిన్న ఆలీ.. నేడు రాజీవ్ కనకాల.. ఇలాంటి ఇబ్బందులు తప్పవు మరి!
ట్రెండింగ్‌లో మహేష్ బాబు కొడుకు పాట.. హిట్టు కొడుతున్నట్టేనా?
పరిష్కారం కోసమా? పరువు తీసుకోవడానికా?.. ఇండస్ట్రీ రచ్చపై మధుర శ్రీధర్
అప్పుడు ‘హరి హర వీరమల్లు’కి.. ఇప్పుడు ‘పెద్ది’కి! - మైత్రీ రవిశంకర్