Varanasi: జెట్ స్పీడ్‌లో.. వార‌ణాసి! 8 నెల‌ల్లో.. షూటింగ్‌ పూర్తి

ABN , Publish Date - Jan 06 , 2026 | 10:46 AM

మహేశ్‌బాబు, రాజమౌళి ‘వారణాసి’ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది.

Varanasi

మహేశ్‌బాబు (Mahesh Babu), రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో పాన్‌ వరల్డ్‌ స్థాయిలో ‘వారణాసి’ (Varanasi )అనే సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. గ్లోబల్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ హైదరాబాద్‌లోని పలు లొకేషన్లలో జరుగుతున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం భారతీయ చిత్ర పరిశ్రమలోనే అత్యంత ఖరీదైన సినిమాగా నిలువనున్నదని ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు.

Varanasi

అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు రాజమౌళి ప్రతి విషయంలోనూ ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారని టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమాలో మహేశ్‌బాబు ‘రుద్ర’ అనే శక్తిమంతమైన పాత్రలో నటిస్తున్నారు. మలయాళ స్టార్‌ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ విలన్‌ పాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా చిత్రీకరణ మరో ఎనిమిది నెలలపాటు కొనసాగనుందని తెలుస్తోంది. 2027 మార్చిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన పారిస్‌లోని లే గ్రాండ్ లెక్స్ (Le Grand Rex) థియేట‌ర్‌లో టీజ‌ర్ ప్ర‌ద‌ర్శించ‌బ‌డిన ఏకైక భార‌తీయ సినిమాగా చ‌రిత్ర పుటల్లో పేరు లిఖించుకుంది.

Updated Date - Jan 06 , 2026 | 10:46 AM