సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Teja Sajja: ఎంగేజ్‌మెంట్‌కు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

ABN, Publish Date - Nov 06 , 2026 | 10:10 PM

‘హను-మాన్’ చిత్రంతో పాన్-ఇండియా స్థాయిలో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుని గ్లోబల్ గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో తేజ సజ్జా త్వరలోనే బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పి ఓ ఇంటివాడు కాబోతున్నారు.

CM Revanth Reddy and Teja Sajja

‘హను-మాన్’ చిత్రంతో పాన్-ఇండియా స్థాయిలో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుని గ్లోబల్ గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో తేజ సజ్జా (Teja Sajja) త్వరలోనే బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పి ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఈ క్రమంలో ఆయన తన జీవితంలో సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే అంగరంగ వైభవంగా జరగనున్న తన నిశ్చితార్థ వేడుక (Teja Sajja Engagement)కు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy)ని తేజ సజ్జా సాదరంగా ఆహ్వానించారు.


శుక్రవారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ (MCR HRD) బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తేజ సజ్జా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు తన నిశ్చితార్థ ఆహ్వాన పత్రికను అందజేసి, వేడుకకు హాజరుకావాల్సిందిగా కోరారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను, వివరాలను తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) అధికారికంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. సీఎం కూడా తేజ సజ్జాకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేసినట్లు సమాచారం.


తేజ సజ్జా వివాహ మహోత్సవం రాబోయే డిసెంబర్ నెలలో రాజస్థాన్‌లోని ప్రముఖ పర్యాటక, చారిత్రక నగరమైన ఉదయ్‌పుర్ వేదికగా డెస్టినేషన్ వెడ్డింగ్‌గా జరగనుంది. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, కొద్దిమంది ఆత్మీయుల సమక్షంలో ఈ పెళ్లి వేడుకను ప్రైవేట్‌గా నిర్వహించనున్నారు. అనంతరం టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, మిత్రుల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ వేడుకను ఏర్పాటు చేయనున్నారు. వరుసగా టాలీవుడ్ యంగ్ స్టార్స్ పెళ్లి పీటలెక్కుతున్న వేళ, తేజ సజ్జా సైతం వివాహ బంధంలోకి అడుగుపెడుతుండటంతో అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి:

శూర్పణఖ పాత్ర కోసం రోజూ 4 గంటల మేకప్.. రకుల్ ఎమోషనల్ పోస్ట్

టాలీవుడ్ స్టార్ హీరోస్.. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్.. వీరిదే హవా

బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల హీరోగా ‘ఫన్’.. వివరాలివే

Updated Date - Nov 06 , 2026 | 10:10 PM