Teja Sajja: సూపర్ స్టార్‌‌కి పోటీగా కాదు.. పాటుగా.. అంతే!

ABN , Publish Date - Jan 02 , 2024 | 07:36 PM

‘యువరాజు’ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి కొడుకుగా నటించిన తేజ సజ్జా.. ఇప్పుడు హీరోగా మారి ‘హనుమాన్’ చిత్రంతో.. మహేష్ ‘గుంటూరు కారం’ చిత్రానికి పోటీగా బరిలోకి దిగుతున్నాడు. ఇదే విషయం సోషల్ మీడియా వేదికగా తేజ సజ్జాకి ఎదురుకాగా, మహేష్ బాబుతో పోటీ కాదు.. పాటుగా అంతే అంటూ మెచ్యూర్డ్‌గా సమాధానమిచ్చారు.

Teja Sajja: సూపర్ స్టార్‌‌కి పోటీగా కాదు.. పాటుగా.. అంతే!
Teja Sajja and Mahesh Babu

ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ (Tollywood Box Office) వద్ద బీభత్సమైన పోటీ జరగబోతోంది. ఇప్పటి వరకు తెలుగు స్ట్రయిట్ సినిమాలు 5, కోలీవుడ్ నుండి 3 వరకు సినిమాలు సంక్రాంతి (Sankranthi)కి సందడి చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. టాలీవుడ్ స్ట్రయిట్ చిత్రాల విషయానికి వస్తే.. సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ (Guntur Kaaram), తేజ సజ్జా ‘హను-మాన్’ (Hanu Man), విక్టరీ వెంకటేష్ ‘సైంధవ్’ (Saindhav), మాస్ మహారాజా రవితేజ ‘ఈగల్’ (Eagle), కింగ్ నాగార్జున ‘నా సామిరంగ’ (Naa Saami Ranga) సినిమాలు బాక్సాఫీస్ వద్ద తలబడబోతున్నాయి. ఈ ఐదు సినిమాల్లో ఏ ఒక్క సినిమా కూడా వెనక్కి తగ్గేందుకు ఒప్పుకోవడం లేదు. దీంతో ఈ సంక్రాంతికి తెలుగు ప్రేక్షకులు ఆసక్తికరమైన ఫైట్‌ని చూసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక విషయంలోకి వస్తే.. ఈ సంక్రాంతికి విడుదల కాబోయే చిత్రాలలో ఓ విశేషం ఉంది. అదేంటంటే..

సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘గుంటూరు కారం’. యంగ్ హీరో తేజ సజ్జా (Teja Sajja), ప్రశాంత్ వర్మ (Prashanth Varma) కాంబోలో రూపొందిన చిత్రం ‘హనుమాన్’. సూపర్ స్టార్‌ మహేష్ బాబుకి ఒకప్పుడు కొడుకుగా నటించిన తేజ సజ్జా.. ఇప్పుడు ఆయనకు పోటీగా వస్తున్నాడంటూ.. కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తుండటం విశేషం. మహేష్ బాబు, వైవీఎస్ చౌదరి కాంబినేషన్‌లో 2000వ సంవత్సరంలో ‘యువరాజు’ (Yuvaraju) అనే సినిమా వచ్చింది. అందులో మహేష్ బాబుకి కొడుకుగా తేజ నటించారు. ఇప్పుడు పెద్దవాడై, హీరోగా మారి.. మహేష్ బాబు సినిమాకే.. అందులోనూ సంక్రాంతి బరిలో దిగుతుండటంతో.. అంతా తేజ సజ్జాను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.


Teja.jpg

అయితే ఈ కామెంట్లను పొగడ్తల్లా తీసుకోకుండా.. సరిచేసే ప్రక్రియకు సిద్ధమయ్యారు తేజ. ‘‘సూపర్ స్టార్‌తో పోటీ ఏంటి సార్.. ఆయనతో పోటీగా కాదు సార్.. ఆయనతో పాటుగా.. అంతే’’ అంటూ తేజ సజ్జా ఎక్స్ వేదికగా రియాక్ట్ అయిన తీరు.. నెటిజన్లకు యమా నచ్చేసింది. మహేష్ బాబు ఫ్యాన్స్‌కి కూడా ఆయన సమాధానం నచ్చడంతో.. ‘ఈ పండుగకి రెండు సినిమాలు చూస్తాం, ఆల్ ద బెస్ట్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తేజ సజ్జా చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. (#HanumanOnJan12th)


ఇవి కూడా చదవండి:

====================

*Mangai: తెలుగమ్మాయ్ ప్రధాన పాత్రలో తమిళ చిత్రం.. ఫస్ట్ లుక్ విడుదల

************************

*Saagar K Chandra: ‘భీమ్లా నాయక్’ దర్శకుడు వదిలిన సర్క్యులర్ చూశారా..

****************************

*SV Ranga Rao: ముత్యాల సుబ్బయ్యకు ముచ్చెటమలు పట్టించిన ఎస్వీఆర్.. విషయం ఏమిటంటే?

************************

*Guntur Kaaram: మాస్‌ బీట్‌‌ని.. నెటిజన్లు మడతెట్టేస్తున్నారు..

****************************

Updated Date - Jan 02 , 2024 | 09:13 PM