Teja Sajja: ఈ జనరేష‌న్‌లో.. 100 రోజులు నీకే సొంతం అని మెసేజ్ చేశారు

ABN , Publish Date - Apr 23 , 2024 | 08:21 PM

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ , తేజ సజ్జా పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ 'హను-మాన్ 25 కేంద్రాలలో 100 రోజుల రన్ పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా తేజ మాట్లాడుతూ..

Teja Sajja: ఈ జనరేష‌న్‌లో.. 100 రోజులు నీకే సొంతం అని మెసేజ్ చేశారు
hanuman

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma), తేజ సజ్జా (Teja Sajja) పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ 'హను-మాన్స‌ (Hanu Man) 25 కేంద్రాలలో 100 రోజుల రన్ పూర్తి చేసుకుంది. మంచి సెంటర్లలో ఈ హిస్టారికల్ మైల్ స్టోన్ ని చేరుకుంది. 92 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో హను-మాన్ ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ ఫాంటసీ అడ్వెంచర్ ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మార్కును వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 5 మిలియన్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. రీజనబుల్ టిక్కెట్ ధరలు ఉన్నప్పటికీ, హను-మాన్ (Hanu Man) అనేక బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ చిత్రం పాన్ ఇండియాగా విడుదలైంది. ఇది హిందీతో సహా అన్ని భాషలలో కమర్షియల్ హిట్‌గా నిలిచింది. హనుమాన్ విజయవంతంగా 100 రోజుల పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ గ్రాండ్ గా సెలబ్రేషన్ నిర్వహించింది.

GL23yoRakAAbem5.jpeg

హీరో తేజా సజ్జా (Teja Sajja) మాట్లాడుతూ.. సత్యం థియేటర్లో 100 రోజులు ఆడిన సినిమాలు చూశాను. అలాంటి ప్లేస్ లో హనుమాన్ (Hanu Man) 100 రోజుల పండగ జరుపుకోవడం ఆనందంగా ఉంది. 'ఈ జనరేష‌న్‌లో 100 రోజులు ఉన్నది నీకే' ఒకరు మెసేజ్ చేశారు. నిజానికి ఇది నా 100 రోజులు కాదు మీ అందరి 100 రోజులు. ఇది ప్రేక్షకులు మాకు ఇచ్చిన గిఫ్ట్. సముద్రఖని గారు మా సినిమాలోకి వచ్చి సినిమా స్థాయిని పెంచారు. నిర్మాత నిరంజన్ గారు చాలా గట్స్ ఉన్న ప్రొడ్యూసర్. గట్స్ ఉన్న వాళ్ళకే హిట్స్. అలాంటి గట్స్ ఉన్న నిరంజన్ గారికి హనుమాన్ మొదటి సినిమా కావడం చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిరంజన్ గారిలోని ధైర్యాన్ని ఈ తరం స్ఫూర్తిగా తీసుకోవాలి. ప్రేక్షకులకు పాదాభివందనాలు. ఈ విజయానికి కారణం ప్రేక్షకులే. ఈ సినిమాకి సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు' తెలిపారు.

GL23yoBaEAAkMu7.jpeg


సముద్రఖని (Samuthirakani) మాట్లాడుతూ.. ఈ వేడుకని చూస్తుంటే చాలా ఎమోషనల్ గా ఉంది. ఏదైనా మంచి పని చేయాలంటే దేవుని బ్లెస్సింగ్స్ ఉండాలి. ఆ దీవెనలే మా అందరినీ ఒక్క చోటికి చేర్చింది. విభీషునిడి పాత్ర చేయాలంటే మామూలు విషయం కాదు. శ్రీరాముని అనుగ్రహం ఉండాలి. నాలో ఆ పాత్రని చూశారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇంత నమ్మకం పెట్టుకున్న ప్రశాంత్ కి ధన్యవాదాలు. తమ్ముడు తేజ చాలా కష్టపడ్డాడు. అందరం ఇష్టపడి కష్టపడ్డాం. మా నిర్మాతలకు ధన్యవాదలు.టీం అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు లేకపోతే ఈ విజయం లేదు.' అన్నారు.

GL23ysTaUAAEsB0.jpeg

Updated Date - Apr 23 , 2024 | 08:23 PM