శూర్పణఖ పాత్ర కోసం రోజూ 4 గంటల మేకప్.. రకుల్ ఎమోషనల్ పోస్ట్

ABN , Publish Date - Nov 06 , 2026 | 09:54 PM

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితీష్ తివారి అత్యంత ప్రతిష్టాత్మకంగా, కనీవినీ ఎరుగని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన పౌరాణిక దృశ్యకావ్యం ‘రామాయణ’. ఈ సినిమాలో శూర్పణఖ పాత్రలో నటించిన రకుల్ తొలిసారి ఆ వివరాలను పంచుకున్నారు.

Rakul on Ramayana role

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితీష్ తివారి అత్యంత ప్రతిష్టాత్మకంగా, కనీవినీ ఎరుగని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన పౌరాణిక దృశ్యకావ్యం ‘రామాయణ’ (Ramayana). భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ తారాగణంతో రూపొందిన ఈ ప్రాజెక్ట్‌ ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) అత్యంత కీలకమైన ‘శూర్పణఖ’ (Surpanakha) పాత్రను పోషించారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ అనుభవాలను పంచుకుంటూ రకుల్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసిన భావోద్వేగ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.


శూర్పణఖ పాత్రను పోషించడం తనకు దక్కిన గొప్ప అవకాశమని పేర్కొంటూ రకుల్ రాసుకొచ్చారు.. ‘‘రామాయణంలో శూర్పణఖగా నటించిన అనుభవాన్ని పంచుకోవడానికి ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇది నా సినీ ప్రయాణంలో అత్యంత ప్రత్యేకమైన జర్నీ. తరతరాలుగా మన సంస్కృతిలో, మన జీవితాల్లో భాగమైన ఇలాంటి ఒక గొప్ప ఇతిహాసంలో భాగస్వామ్యం కావడం ఎవరికైనా అంత ఈజీగా దక్కే అవకాశం కాదు. మన దేశానికి ఎంతో ప్రాముఖ్యమైన కథను ఇంతటి భారీ స్కేల్‌లో వెండితెరపై సజీవంగా ఆవిష్కరించడం నిజంగా అద్భుతం’’ అని తెలిపారు.

భారతీయ సినిమా సత్తాను ప్రపంచానికి చాటిచెప్పేలా ఇంతటి మహోన్నత ప్రాజెక్ట్‌ను కలగని, నిజం చేసిన నిర్మాత నమిత్ మల్హోత్రా, దర్శకుడు నితీష్ తివారిలకు రకుల్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ సినిమాలో నటించిన రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యష్, రవి దూబే, కాజల్ అగర్వాల్, శోభనలతో పాటు చిత్ర యూనిట్‌కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.


ముఖ్యంగా తన శూర్పణఖ రూపం కోసం పనిచేసిన మేకప్, కాస్ట్యూమ్స్ బృందాన్ని రకుల్ ప్రత్యేకంగా కొనియాడారు. ‘‘ఈ లుక్‌కు వస్తున్న ప్రశంసలన్నీ నా హెయిర్ అండ్ మేకప్, కాస్ట్యూమ్స్ టీమ్‌కే చెందుతాయి. ప్రతిరోజూ నన్ను ఈ పాత్ర కోసం సిద్ధం చేయడానికి వారు ఏకంగా 4 గంటల పాటు కష్టపడేవారు’’ అంటూ ఆసక్తికర విషయాన్ని సరదాగా పంచుకున్నారు. చివరగా, ‘‘ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు.. ఒక భారతీయురాలిగా నన్ను ఎంతో గర్వపడేలా చేసిన అద్భుతమైన క్షణం’’ అని రకుల్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి:

టాలీవుడ్ స్టార్ హీరోస్.. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్.. వీరిదే హవా

బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల హీరోగా ‘ఫన్’.. వివరాలివే

డిసెంబర్‌లో పెళ్లికి సిద్ధమైన మరో జంట.. ఎవరో తెలుసుగా

Updated Date - Nov 06 , 2026 | 09:54 PM

Rakul Preet Singh: ఆ రోజులు పోయాయి.. ఆ సత్తా మాకూ ఉంది 

Rakul Preet Singh: ఆయన పక్కన లేకపోతే... అందుకే అలా చేశా..

Rakul Preet Singh: ఆదివారం మాత్రం నన్నెవరూ ఆపలేరు

Rakul Preet Singh: ఆ పదం సరైనదో కాదో తెలియదు

Rakul Preet Singh : జీవితాన్ని ఇచ్చిన చిత్రానికి పదేళ్లు!