Teja Sajja: సమస్య వుంటే చాలు.. గెటప్ శ్రీను అదరగొట్టేస్తాడు

ABN , Publish Date - May 05 , 2024 | 08:58 PM

బుల్లితెర కమల్ హాసన్‌గా పాపులరైన జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘రాజు యాదవ్’తో హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కృష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను సూపర్ హీరో తేజ సజ్జా చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.

Teja Sajja: సమస్య వుంటే చాలు.. గెటప్ శ్రీను అదరగొట్టేస్తాడు

బుల్లితెర కమల్ హాసన్‌ (Small Screen Kamal Haasan) గా పాపులరైన జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను (Getup Srinu) హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘రాజు యాదవ్’ (Raju Yadav) సినిమాతో హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కృష్ణమాచారి (Krishnamachary K) దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ‘టీజర్‌, రాజు యాదవ్ చూడు, థిస్ ఈజ్ మై దరిద్రం’ వంటి ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మే 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోన్న నేపధ్యంలో మేకర్స్ చిత్ర ట్రైలర్‌ విడుదల కార్యక్రమాన్ని గ్రాండ్‌గా నిర్వహించారు. ‘హనుమాన్’ హీరో తేజ సజ్జా (Hanuman Hero Teja Sajja) ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ని విడుదల చేశారు.

*Getup Srinu: జనసేనకు ప్రచారం చేయమని ఎవరూ అడగలేదు.. అభిమానంతో వెళ్లాం

ట్రైలర్ ఎలా ఉందంటే.. కామెడీ, లవ్, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. రాజు (గెటప్ శ్రీను) క్రికెట్ ఆడుతుండగా మొహానికి బాల్ తగులుతుంది. అప్పటి నుంచి రాజు ముఖం స్మైలీగా మారిపోతుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నవ్వు ముఖమే వుంటుంది. మళ్ళీ మాములు దశకు రావాలంటే ఆపరేషన్ చేయాలి. దానికి డబ్బు కావాలి. మరి ఆపరేషన్‌కు సరిపడా డబ్బు సమకూరిందా? స్మైల్ ఫేస్‌తో రాజు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నాడు? తన లవ్ లైఫ్ ఏమయింది? ఇవన్నీ హిలేరియస్‌గా.. ఎమోషన్స్‌తో హత్తుకునేలా ఈ సినిమా తెరకెక్కినట్లుగా ఈ ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. గెటప్ శ్రీను విలక్షణమైన క్యారెక్టర్‌లో మంచి నటనను కనబరిచాడు. దర్శకుడు కృష్ణమాచారి కొత్త కాన్సెప్ట్‌తో హోల్సమ్ ఎంటర్‌టైనర్‌ని రియలిస్టిక్‌గా అందించబోతున్నాడని ఈ ట్రైలర్ తెలియజేస్తుంది. ఇక ట్రైలర్ చివరిలో ఇచ్చిన ట్విస్ట్ ఈ సినిమాపై మరింత క్యురియాసిటీని పెంచింది. మొత్తంగా అయితే హీరోగా గెటప్ శ్రీను మంచి కంటెంట్ ఉన్న చిత్రంతో ఎంట్రీ కాబోతున్నాడనేది ఈ ట్రైలర్‌తో తెలుస్తోంది. (Raju Yadav Trailer Talk)


ఇక ఈ ట్రైలర్ విడుదల అనంతరం సూపర్ హీరో తేజ సజ్జా (Teja Sajja) మాట్లాడుతూ.. ‘‘శ్రీను ‘జాంబిరెడ్డి’ చిత్రం నుంచి పరిచయం. తను విలక్షణమైన నటుడు. ‘జాంబిరెడ్డి’లో కళ్ళు మూసుకొని నటించారు. ‘హనుమాన్’లో పళ్ళ సెట్ పెట్టుకొని నవ్వించారు. ఏదైనా ఒక సమస్య వుంటే ఆయన అద్భుతంగా నటిస్తారు. ‘రాజు యాదవ్’లో నవ్వుతూనే వుండాలనే సమస్య వుంది. ఖచ్చితంగా అదరగొట్టివుంటారు. ఇది చాలా మంచి కథ. ఒక అర్థవంతమైన సినిమాకి కామెడీ జోడిస్తే అది పెద్ద సినిమా అవుతుంది. అర్థవంతమైన ఎమోషన్స్‌తో మీనింగ్ ఫుల్ మూవీ ఇది. ఇలాంటి సినిమా చేసిన టీం అందరికీ ఆల్ ది బెస్ట్. శ్రీను చాలా మంచి వ్యక్తిత్వం వున్న మనిషి. సినిమా కోసం అహర్నిశలు కష్టపడతారు. పక్కన వున్న నటులని కూడా సపోర్ట్ చేస్తారు. కామెడీ చేయడం కష్టమైన పని. కామెడీ చేసే వాళ్ళు ఏడిపిస్తే ఎంత అద్భుతంగా వుంటుందో బ్రహ్మానందం‌గారు చేస్తే ఒకసారి చూశాం. ఈసారి గెటప్ శ్రీను చేయబోతున్నారు. ఇది నవ్విస్తూ మనసుని హత్తుకునే చిత్రం. మే 17న విడుదలౌతుంది. ఇలాంటి మంచి సినిమాని తప్పకుండా అందరూ ప్రోత్సహించండి. దర్శక, నిర్మాతలకు ఆల్ ది బెస్ట్. హర్ష వర్ధన్ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. ఇందులో ‘రాజు యాదవ్’ పాటని చాలా ఎంజాయ్ చేశాను. ఈ సినిమాకి గొప్ప పేరొచ్చి శ్రీనుకి, సినిమా యూనిట్ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

Read Latest Cinema News

Updated Date - May 05 , 2024 | 08:58 PM