Teja Sajja: అన్నీ కష్టాలే.. ఓ పెద్ద వ్యక్తే నమ్మించి మోసం చేశాడు..

ABN , Publish Date - Sep 08 , 2025 | 05:59 PM

‘ఏరంగంలోనైనా ఎదగాలంటే కష్టాలు తప్పవు. నేను హీరోగా ఇండస్ర్టీకి వచ్చినప్పుడు చాలా కష్టాలుపడ్డాను. అవమానాలు, రిజెక్షన్లు, నమ్మించి మోసం చేయడం ఇలా చాలా చూశాను.



తేజ సజ్జా (Teja Sajja) సూపర్‌ యోధగా కనిపించి సందడి చేయడానికి సిద్దమవుతున్నారు. కార్తిక్‌ ఘట్టమనేని (karthik Ghattamaneni) దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘మిరాయ్‌’ (Mirai). సెప్టెంబర్‌ 12న ప్రేక్షకుల ముందుకురానుంది. తాజాగా హీరో వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.  

‘నేను చిన్నప్పుడు చాలా గొప్ప వ్యక్తుల మధ్య పెరిగాను. చిరంజీవి ఎప్పుడూ నన్ను సొంత పిల్లాడిలా చూసుకున్నారు. అందుకే ఆయనంటే నాకు అపారమైన గౌరవం. ఆయనకు ఉన్న టెన్షన్స్‌లోనూ సెట్‌లో ఉన్నవారి బాగోగులు చూసుకుంటారు. ‘హనుమాన్‌’ చూశాక నాకు ఫోన్‌ చేసి సుమారు 20 నిమిషాలు మాట్లాడారు. భవిష్యత్తులో ఎలా ఉండాలో చాలా సలహాలిచ్చారు. ‘చూడాలని ఉంది’ సినిమా చైల్డ్‌ ఆర్టిస్ట్‌ల కోసం వంద ఫొటోలు వచ్చాయి. వాటి నుంచి చిరంజీవి నన్ను సెలెక్ట్‌ చేశారు. ఆరోజు ఆయన నా ఫొటో సెలక్ట్‌ చేయకపోతే ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. అలా నా కెరీర్‌ మొదలైంది. మాకు సినీ నేపథ్యం లేకపోవడంతో పెద్దయ్యాక హీరో అవుతానంటే ఇంట్లో వాళ్లు చాలా భయపడ్డారు. నేను పట్టుదలతో వచ్చాను. ‘ఓ బేబీ’ సినిమా సమయంలో సమంత చాలా సపోర్ట్‌ చేశారు. నా గురించి అందరికీ తెలియాలని ప్రమోషన్స్‌కి నన్నే పంపేవారు. వెళ్లిన ప్రతిచోట నా గురించి చెప్పేవారు’ అని అన్నారు.  




‘ఏరంగంలోనైనా ఎదగాలంటే కష్టాలు తప్పవు. నేను హీరోగా ఇండస్ర్టీకి వచ్చినప్పుడు చాలా కష్టాలుపడ్డాను. అవమానాలు, రిజెక్షన్లు, నమ్మించి మోసం చేయడం ఇలా చాలా చూశాను. అన్ని ఒడుదొడుకులు చూశాను కాబట్టే నాపై నాకు నమ్మకం పెరిగింది. నన్ను మోసం చేసిన వాళ్లలో చాలామంది పెద్ద మనుషులున్నారు. ఒకసారి స్టార్‌ దర్శకుడు ఓ కథ చెప్పి షూటింగ్‌ మొదలుపెట్టారు. 15 రోజుల చిత్రీకరణ జరిగింది. ఒకరోజు హఠాత్తుగా ఆ సెట్స్‌కు మరో హీరో వచ్చాడు. ఆ సినిమాలో అతడు హీరో అని నాకు అప్పుడు అర్థమైంది. నాకు కథ చెప్పడం కంటే ముందే ఆ హీరోకు కథ వినిపించారు. అతనికి సీన్స్‌ చూపించడం కోసం సీన్స్‌ చూపించడం కోసం నాతో మాక్‌ షూట్‌ చేశారని తర్వాత తెలిసింది’ అని అన్నారు. 

Updated Date - Sep 08 , 2025 | 05:59 PM