సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rashmika Mandanna: షూటింగ్‌కు వెళ్లాలంటే.. వణుకు పుట్టింది

ABN, Publish Date - Sep 21 , 2026 | 06:47 AM

జీవితంలో మొదటిసారి షూటింగ్‌కు వెళ్లాలంటే వణుకు పుట్టింది’ అని అన్నారు రష్మిక మందన్న

Rashmika Mandanna

‘‘మైసా’ (Mysaa) చిత్రం కోసం నా లైఫ్‌నే ఇచ్చేశాను. డైరెక్టర్‌ నాతో చాలా రిస్కీ స్టంట్స్‌ చేయించారు. కేరళలో దట్టమైన అడవులు, కొండ ప్రాంతాల్లో షూటింగ్‌ చేశాం. కొండపైకి పరిగెత్తుకుంటూ వెళ్లమని, వాటర్‌ఫాల్స్‌ నుంచి దూకమని డైరెక్టర్‌ చేప్పేవారు. జీవితంలో మొదటిసారి షూటింగ్‌కు వెళ్లాలంటే వణుకు పుట్టింది’ అని అన్నారు రష్మిక మందన్న (Rashmika Mandanna). ఆమె కథానాయికగా మ‌ను రాఘ‌వ పూడి శిష్యుడు రవీంద్ర పుల్లే (Rawindra Pulle) తెరకెక్కించిన చిత్రం ‘మైసా’. అజయ్‌ సాయిపురెడ్డి, అనిల్‌ సయ్యపురెడ్డి, వీరసాయి గోప నిర్మించారు. నవంబరు 27న విడుదలవుతోంది.

ఆదివారం నిర్వహించిన టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో రష్మిక మాట్లాడుతూ ‘కథ విన్నప్పుడు అద్భుతంగా అనిపించింది. కానీ, అదే ఇమాజినేషన్‌ను రియల్‌గా చేయాలంటే ఎంత కష్టమో అర్థమైంది. ఈ చిత్రంలో అండర్‌వాటర్‌ సీక్వెన్స్‌ ఉంది. రోజుకు ఎనిమిది గంటలపాటు నీటిలోనే ఉన్నాను. డ్యాన్స్‌ చేసేటప్పుడు తుంటి భాగంలో గాయం కూడా అయింది. డైరెక్టర్‌ అంత రియల్‌గా చేయించారు’ అని అన్నారు.

దర్శకుడు రవీంద్ర మాట్లాడుతూ ‘ఇప్పటి వరకు మీరు క్యూట్‌గా, స్వీట్‌గా ఉండే రష్మికను చూశారు. ఈ సినిమాలో రష్మిక ముఖంపై రక్తం పడితే ఎలా ఉంటుందో చూస్తారు’ అని చెప్పారు. ‘రష్మిక ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశారు. కొన్ని స్టంట్స్‌ చేయడానికి లైఫ్‌ని కూడా రిస్క్‌ చేశారు’ అని నిర్మాత అజయ్‌ అన్నారు.

Updated Date - Sep 21 , 2026 | 07:21 AM