అప్పుడు వ‌రుస డిజాస్ట‌ర్లైనా ఛాన్సులు.. ఇప్పుడు హిట్ ప‌డినా ప‌ట్టించుకోవ‌ట్లేదు

ABN , Publish Date - Sep 21 , 2026 | 08:51 AM

సినీ పరిశ్రమలో అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో, ఎప్పుడు ఎవరిని పక్కన పెడుతుందో ఎవరూ ఊహించలేరు.

Bhagyashri Borse

సినీ పరిశ్రమలో అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో, ఎప్పుడు ఎవరిని పక్కన పెడుతుందో ఎవరూ ఊహించలేరు. ఇక్కడ రాత్రికి రాత్రే స్టార్లు అయిపోయిన వాళ్లు ఎంతమంది ఉన్నారో.. ఒకే ఒక్క ఫ్లాప్‌తో కనుమరుగైపోయిన వాళ్లూ అంతేమంది ఉన్నారు. ముఖ్యంగా హీరోయిన్ల కెరీర్ గ్రాఫ్ ఎప్పుడూ ఒక రేంజ్‌లో ఊగిసలాడుతూనే ఉంటుంది. చేతిలో సక్సెస్ ఉంటేనే రెడ్ కార్పెట్ వేస్తారు, లేదంటే ఆడిషన్స్‌కు కూడా పిలవని పరిస్థితి కనిపిస్తుంది. అందుకే కాస్త క్రేజ్ ఉన్నప్పుడే దక్కిన ప్రతి అవకాశాన్నీ ఒడిసిపట్టుకోవాలని అందరూ తాపత్రయపడతారు.

కానీ ప్రస్తుతం గ్లామర్ క్వీన్ భాగ్యశ్రీ భోర్సే (Bhagyashri Borse) పరిస్థితి చూస్తుంటే ఇండస్ట్రీ లెక్కలు ఎంత విచిత్రంగా ఉంటాయో అర్థమవుతుంది. మంచి క్రేజ్ ఉంది.. అందం, నటనలో టాలెంట్ ఉంది.. రీసెంట్‌గా లెనిన్ (Lenin) లాంటి బ్లాక్‌బస్టర్ హిట్టు కూడా ఉంది. అయినా సరే తెలుగులో ఊహించినంత జోరు ఎందుకు కనిపించడం లేదు..? ఆమె కెరీర్‌లో జరుగుతున్న ఆ ట్విస్ట్ ఏంటి..? రవితేజ హీరోగా వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan ) సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది భాగ్యశ్రీ భోర్సే. సినిమా రిజల్ట్ పక్కన పెడితే.. మొదటి చిత్రంతోనే యూత్‌ను కట్టిపడేసింది. స్క్రీన్ ప్రెజెన్స్, అద్భుతమైన గ్లామర్, గ్రేస్‌ఫుల్ డ్యాన్స్‌లతో తెలుగు ఆడియన్స్‌ను ఫిదా చేసింది. ఆ సినిమా పాటలు, ప్రోమోలు రిలీజ్ అయినప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ భామ పేరే వినిపించింది.

ఒక కొత్త హీరోయిన్‌కు ఈ స్థాయి బజ్ రావడం చాలా అరుదుగా జరుగుతుంది. దాంతో టాలీవుడ్‌కు మరో క్రేజీ స్టార్ దొరికేసిందని, ఇక ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనిలేదని దర్శకనిర్మాతలు సైతం భావించారు. ఆ తర్వాత వరుసగా ఎదురైన ఒడిదుడుకులను అధిగమిస్తూ.. రీసెంట్‌గా ‘లెనిన్’ ప్రాజెక్ట్‌తో అదిరిపోయే సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రంలో తన నటనకు ప్రశంసలతో పాటు కమర్షియల్ విక్టరీ కూడా దక్కింది. సాధారణంగా ఇలాంటి టైమ్‌లో ఏ హీరోయిన్‌కైనా చేతినిండా ప్రాజెక్టులు ఉండాలి. వరుసగా అగ్రిమెంట్ల మీద సంతకాలు జరగాలి. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఎదురైంది. టాలీవుడ్ నుంచి పెద్ద ఎత్తున అవకాశాలు వెల్లువెత్తుతాయని అంతా ఆశించారు. కానీ ఆశ్చర్యకరంగా టాలీవుడ్‌లో ప్రస్తుతం ఈ అమ్మడికి కొత్త ప్రాజెక్ట్‌లు పెద్దగా అనౌన్స్ కాలేదు.

కాల్షీట్ల సమస్యలా? లేక కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోందా? అనేది క్లారిటీ లేకపోయినా.. ప్రస్తుతం టాలీవుడ్‌లో కాస్త గ్యాప్ వచ్చిన మాట మాత్రం వాస్తవం. తెలుగులో పరిస్థితి ఇలా ఉంటే.. పక్క రాష్ట్రాలైన కోలీవుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీలు మాత్రం ఈ బ్యూటీ టాలెంట్‌ను ఏమాత్రం వృథా పోనివ్వడం లేదు. అక్కడ ఏకంగా బడా ప్రాజెక్టులు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. తమిళంలో లోకనాయకుడు కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థలో రూపుదిద్దుకుంటున్న ‘సియోన్’ (Seyon)చిత్రంలో టాప్ స్టార్ శివకార్తికేయన్ సరసన హీరోయిన్‌గా ఎంపికై ఏకంగా జాక్‌పాట్ కొట్టేసింది. ఈ ప్రాజెక్ట్ తమిళంలో ఆమెకు తిరుగులేని స్టార్‌డమ్‌ను ఇచ్చే అవకాశముంది.

ఇటు తమిళంతో పాటు తాజాగా తొలిసారి మలయాళంలోనూ అడుగుపెడుతోంది. అక్కడ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మోహ‌న్ లాల్‌ మూవీ ‘ఆపరేషన్ గంగ’(Operation Ganga) లో కీలక పాత్రలో కనిపించబోతోంది. ఇలా ఒకేసారి రెండు ప్రధాన భాషల్లో భారీ చిత్రాలతో బిజీ అయిపోయింది. తెలుగులో ప్రస్తుతానికి కాస్త విరామం కనిపించినా.. తమిళ, మలయాళ ఇండస్ట్రీల్లో రాబోయే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లు కనుక హిట్ అయితే, భాగ్యశ్రీ రేంజ్ మరో స్థాయికి వెళ్లడం ఖాయం. ఆ విజయాల జోరుతో మళ్లీ టాలీవుడ్‌లో మరింత పవర్ ఫుల్‌గా రీఎంట్రీ ఇచ్చి, స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలతో బిజీ అవుతుందని సినీ విశ్లేషకులు, ఆమె అభిమానులు బలంగా నమ్ముతున్నారు.


ఇవి కూడా చ‌ద‌వండి..

విజయ్‌తో వివాదంపై క్లారిటీ ఇచ్చిన విజయ్ సేతుపతి.. ఏం చెప్పారంటే?

వరంగల్ ఎయిర్ పోర్టుకు ‘సమ్మక్క-సారక్క’ పేరు పెట్టండి.. సీఎం పిలుపుకు దర్శకుడి స్పందన

పాపం 'స్వీటీ' ఏ స్థాయిలో ఉండే.. ఇప్పుడేమైపోయింది

Spirit: ప్రభాస్ ఊరమాస్ ట్రీట్.. థియేటర్లు ఇక ఊగి పోవాల్సిందే!

Nani: ఇంకో 15 ఏళ్లు.. డూప్‌తో పనిలేదు

మ‌ళ్లీ ఏమైందిరా.. వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ డేట్‌పై సస్పెన్స్

Vishwambhara Release: విశ్వంభరపై వశిష్ఠ పోస్ట్ వైరల్.. ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్

నాని.. ఇక లేదు గ్యాపు! రాబోయే రెండేళ్లు.. ఫుల్ ట్రీటు

రాజమౌళి సెంటిమెంట్.. ‘కుంభ’ బ‌ల ప‌డ‌తాడా లేక బలవుతాడా?

Updated Date - Sep 21 , 2026 | 09:18 AM