Spirit: ప్రభాస్ ఊరమాస్ ట్రీట్.. థియేటర్లు ఇక ఊగి పోవాల్సిందే!
ABN , Publish Date - Sep 20 , 2026 | 06:03 PM
‘స్పిరిట్’ సినిమాలో ప్రభాస్‌తో కలిసి ఓ స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులేయనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ (Prabhas).. సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). ఈ ఇద్దరి కాంబినేషన్ పేరు వింటేనే బాక్సాఫీస్ దగ్గర పూనకాలు రావడం ఖాయం. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' వంటి బ్లాక్‌బస్టర్ల తర్వాత సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ స్పిరిట్ (Spirit). డార్లింగ్ ప్రభాస్ కెరీర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై రోజురోజుకూ అంచనాలు ఏ రేంజ్‌లో పెరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే విడుదలైన ఆడియో గ్లింప్స్, పోస్టర్లు సోషల్ మీడియాను ఊపేయగా.. ఇప్పుడు మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
అదేంటంటే.. 'స్పిరిట్' సినిమాలో సందీప్ రెడ్డి ఓ మైండ్ బ్లోయింగ్ స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేశారట. సాధారణంగా సందీప్ సినిమాల్లో మ్యూజిక్, బీజీఎమ్స్ ఏ స్థాయిలో ఉంటాయో మనందరికీ తెలిసిందే. ఇక ఈ స్పెషల్ సాంగ్ విషయానికి వస్తే, ఇందులో ప్రభాస్ ను మునుపెన్నడూ చూడని అత్యంత స్టైలిష్ అండ్ డైనమిక్ లుక్ లో చూపించబోతున్నారట. డార్లింగ్ కి సంబంధించిన ఆ స్టైలిష్ లుక్ ను సందీప్ వంగా ఇప్పటికే లాక్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
ఈ పాట థియేటర్లలో పడితే అభిమానుల ఈలలు, గోలలతో థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. అంతేకాకుండా, ఈ స్పెషల్ సాంగ్‌లో ప్రభాస్‌తో కలసి స్టెప్పులేసేందుకు ఓ గ్లామరస్ స్టార్ హీరోయిన్‌ను రంగంలోకి దించుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఆ స్టార్ కథానాయిక ఎవరనేది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారినప్పటికీ, త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ పాటపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇక ఈ చిత్రంలో కథానాయికగా 'యానిమల్' ఫేమ్ త్రిప్తి దిమ్రి నటిస్తుండగా.. బాలీవుడ్ మాస్ విలన్ వివేక్ ఒబేరాయ్, ఐశ్వర్య దేశాయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ పక్కా 'వైల్డ్ అండ్ మాస్' అవతార్‌లో కనిపించబోతున్నాడు. సందీప్ రెడ్డి వంగా మార్కు రౌద్రం, హింసకు తోడు.. ప్రభాస్ మార్కు మాస్ ఎలిమెంట్స్ తోడైతే థియేటర్లలో ఊచకోతే అని విశ్లేషకులు చెబుతున్నారు.
అంతేకాదు, ఈ సినిమా కేవలం భారత్‌లోనే కాకుండా చైనీస్, కొరియన్ వంటి పలు విదేశీ భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక వచ్చే ఏడాది మార్చి 5న స్పిరిట్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ కెరీర్‌లోనే 'స్పిరిట్' ఒక సరికొత్త మైలురాయిగా నిలిచిపోతుందని, బాక్సాఫీస్ వద్ద పాత రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తుందని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.
ఇవి కూడా చదవండి..
విజయ్‌తో వివాదంపై క్లారిటీ ఇచ్చిన విజయ్ సేతుపతి.. ఏం చెప్పారంటే?
వరంగల్ ఎయిర్ పోర్టుకు ‘సమ్మక్క-సారక్క’ పేరు పెట్టండి.. సీఎం పిలుపుకు దర్శకుడి స్పందన
పాపం 'స్వీటీ' ఏ స్థాయిలో ఉండే.. ఇప్పుడేమైపోయింది