విజయ్‌తో వివాదంపై క్లారిటీ ఇచ్చిన విజయ్ సేతుపతి.. ఏం చెప్పారంటే?
ABN , Publish Date - Sep 20 , 2026 | 05:17 PM
తమిళనాడులో గత కొన్ని రోజులుగా చర్చనీయాంశంగా మారిన నటుడు విజయ్ సేతుపతి, ముఖ్యమంత్రి విజయ్ కు సంబంధించిన వివాదం కూడా కొత్త మలుపు తిరిగింది.
తమిళనాడులో గత కొన్ని రోజులుగా చర్చనీయాంశంగా మారిన నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi), ముఖ్యమంత్రి విజయ్ (Vijay TVK) కు సంబంధించిన వివాదం కూడా కొత్త మలుపు తిరిగింది. ఎట్టకేలకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌తో వివాదానికి నటుడు విజయ్ సేతుపతి తెరదించాడు. బిగ్ బాస్ షోలో విజయ్ సేతుపతి చేసిన వ్యాఖ్యలపై టీవీకే శ్రేణులు తమిళనాడు (Tamil Nadu) వ్యాప్తంగా నిరసనలకు దిగాయి.. దీనితో ఈ వివాదానికి తెరదించుతూ.. విజయ్ సేతుపతి ఇటీవల ఓ సినిమా ఫంక్షన్‌లో మాట్లాడాడు.
తాను ఇటీవల విజయ్ కుమారుడు జేసన్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపానని, వెంటనే విజయ్ స్వయంగా ఫోన్ చేసి ధన్యవాదాలు చెప్పారని ఇది ఊహించలేదని ఆయన చెప్పుకొచ్చాడు. ఆ కాల్ తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని చెప్పారు. అలాగే జేసన్‌కు తనంటే ఎంతో ఇష్టమని తెలిసి ఆశ్చర్యపోయానని విజయ్ సేతుపతి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవనే సంకేతాలు వెళ్లాయని అభిమానులు భావిస్తున్నారు.
మరోవైపు ఇదే కార్యక్రమంలో ముఖ్యమంత్రి విజయ్‌ను డైరెక్టర్ అట్లీ ఆకాశానికెత్తేశాడు.ఈ తరానికి విజయ్ ఎంతో స్ఫూర్తి అని అన్నాడు. విజయ్ వల్లే యువతలో రాజకీయాలపై ఆసక్తి పెరిగిందని, తమిళనాడు అసెంబ్లీ సమావేశాలను ఇప్పటి జెన్ జీ తరం కూడా చూస్తోందన్నాడు. ఇదిలాఉంటే.. విజయ్, విజయ్ సేతుపతి, అట్లీకి సంబంధించిన అంశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
వరంగల్ ఎయిర్ పోర్టుకు ‘సమ్మక్క-సారక్క’ పేరు పెట్టండి.. సీఎం పిలుపుకు దర్శకుడి స్పందన
పాపం 'స్వీటీ' ఏ స్థాయిలో ఉండే.. ఇప్పుడేమైపోయింది
Spirit: ప్రభాస్ ఊరమాస్ ట్రీట్.. థియేటర్లు ఇక ఊగి పోవాల్సిందే!