నాని.. ఇక లేదు గ్యాపు! రాబోయే రెండేళ్లు.. ఫుల్ ట్రీటు

ABN , Publish Date - Sep 20 , 2026 | 08:02 PM

ది ప్యారడైజ్ కోసం దాదాపు ఏడాదిన్నరగా ఫుల్ జిజీగా ఉన్న నాని తర్వాత కూడా వరుస సినిమాలను లైన్లో పెట్టారు.

Nani

నాని (Nani).. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ నేచురల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. నాని నుంచి సినిమా వస్తుందంటే చాలు హిట్ అనే ఆడియన్స్ ఫిక్స్ అయిపోతారు. అంతలా ఇంట్లో మనిషా మారిపోయాడు నాని. ప్రస్తుతం నాని, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఊరమాస్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ లో నటిస్తున్నారు. కయాదు లోహర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు, ఈశ్వరి రావు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈ నెల 24న విడుదల కానుంది.

ది ప్యారడైజ్ కోసం దాదాపు ఏడాదిన్నరగా ఫుల్ జిజీగా ఉన్న నాని తర్వాత కూడా వరుస సినిమాలను లైన్లో పెట్టారు. ఇప్పటికే యంగ్ డైరెక్టర్ సుజిత్ (Sujeeth) దర్శకత్వంలో బ్లడీ రోమియో' సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా మరో రెండు కొత్త ప్రాజెక్టులకు కూడా లైన్ లో పెట్టినట్లు సమాచారం. ఈ సినిమాను గత ఏడాదే ప్రారంభించాలని నాని భావించారు. 2025లో షూటింగ్ మొదలుపెట్టి, 2026 క్రిస్మస్ సందర్భంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. అయితే ‘ది ప్యారడైజ్’ షూటింగ్ ఎక్కువ కాలం కొనసాగడంతో ‘బ్లడీ రోమియో’ ప్రాజెక్ట్ ఆలస్యమైంది.

ఇప్పుడు అక్టోబర్ నుంచి నాని ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నట్లు సమాచారం. సుజీత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘బ్లడీ రోమియో’ (Bloody Romeo) షూటింగ్‌లో ఎక్కువ భాగం లండన్‌లో జరగనుందని తెలుస్తోంది. కథకు తగ్గట్టుగా విదేశీ లొకేషన్లలో భారీ యాక్షన్, విజువల్ సన్నివేశాలను తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను 2027 సమ్మర్ లో రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ‘బ్లడీ రోమియో’తో పాటు నాని మరో క్రేజీ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పినట్లు సమాచారం. ‘వెంకీ అట్లూరి’ దర్శకత్వంలో నాని ఓ సినిమా చేయనున్నారట. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభమయ్యే అవకాశం ఉందని టాక్. ‘జెర్సీ’ తర్వాత సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments) పై నిర్మాత నాగ వంశీ (Naga Vamsi) మరోసారి నానితో కలిసి పనిచేయబోతున్నారని తెలుస్తోంది. ఇటీవల విశ్వనాధ్ అండ్ సన్స్ తో సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న వెంకీ అట్లూరి.. నానితో ఎలాంటి కథను తెరకెక్కించబోతున్నారనే ఆసక్తి ఇప్పటికే మొదలైంది.

మరోవైపు తమిళ దర్శకుడు సిబి చక్రవర్తి (Sibi Chakravarthi) తో కూడా నాని సినిమా చేయనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. శివకార్తికేయన్‌తో ‘సిబి చక్రవర్తి’ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత 2027లో నానితో సినిమా ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా నాని కెరీర్‌లో వరుసగా మూడు సినిమాలు లైన్‌లో ఉన్నాయి. ముందుగా అక్టోబర్ నుంచి ‘బ్లడీ రోమియో’ షూటింగ్ మొదలుకానుండగా, ఆ తర్వాత వెంకీ అట్లూరి ప్రాజెక్ట్, సిబి చక్రవర్తి సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ మూడు సినిమాలు ఒకదానికొకటి భిన్నమైన కథలతో తెరకెక్కనున్నట్లు తెలుస్తుండటంతో నాని అభిమానులకు రాబోయే రెండేళ్లు వరుస సినిమాలతో ఫుల్ ట్రీట్ ఉండబోతోందని చెప్పొచ్చు.

Updated Date - Sep 20 , 2026 | 08:28 PM