‘రాయవలస’ నుంచి పవర్ ఫుల్ పోస్టర్ విడుదల

ABN , Publish Date - Nov 09 , 2026 | 03:02 PM

రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత గోపి కృష్ణ జయంతి నిర్మిస్తోన్న తాజా చిత్రం ‘రాయవలస’. ఓ విలక్షణ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి రాధిక జయంతి దర్శకత్వం వహిస్తున్నారు.

Rayavalasa Poster

రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత గోపి కృష్ణ జయంతి నిర్మిస్తోన్న తాజా చిత్రం ‘రాయవలస’ (Rayavalasa). ఓ విలక్షణ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి రాధిక జయంతి (Radhika Jayanthi) దర్శకత్వం వహిస్తున్నారు. కార్తీక్ జయంతి, శ్రీష నులు హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌ ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంటోంది. ఫస్ట్ సింగిల్‌గా వచ్చిన ‘రింగుడు రింగుడు’ (Ringudu Ringudu) పాట యూట్యూబ్‌లో ఇప్పటికీ విశేష ఆదరణ దక్కించుకుంటూ చార్ట్‌బస్టర్‌ దిశగా దూసుకెళుతోంది. ఈ పాటతో పాటు అంతకుముందు విడుదలైన పోస్టర్లు కూడా సినిమాపై ఆసక్తిని రేకెత్తించాయి. ఈ క్రమంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ సరికొత్త స్పెషల్ పోస్టర్‌ (Rayavalasa Diwali Special Poster)ను విడుదల చేసింది.


పండగ స్పెషల్‌గా విడుదల చేసిన ఈ పవర్‌ఫుల్ పోస్టర్ సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఇందులో హీరో కార్తీక్ జయంతి ఇంటెన్స్, మాస్ అవతారంలో దర్శనమిచ్చారు. ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే సినిమాలో హై-వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్ భారీ స్థాయిలో ఉండబోతున్నాయని స్పష్టమవుతోంది. ఈ మాస్ పోస్టర్ చిత్ర స్థాయిని, కంటెంట్‌లోని దమ్మును తెలియజేస్తూ.. సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేసింది. ఈ సినిమాను డిసెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లుగా నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.


ఈ చిత్రంలో అన్నపూర్ణమ్మ, అనిత చౌదరి, జయప్రకాశ్, రవివర్మ, కాశీ విశ్వనాథ్, త్రినాధరావు, కంచరపాలెం రాజు, సుహాసన్, వివేక్ వర్ధన్, మృదుల, గాంధీ, లక్ష్మణ్, లండన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అర్జున్ బాల సంగీతం అందించగా.. పూర్ణాచారి, కార్తీక్ జయంతి, తరుణ్ సైదుల్ సాహిత్యాన్ని సమకూర్చారు. రాహుల్ సిప్లిగంజ్, ధనుంజయ్, రోహిత్ పరిటాల, రమ్య బెహరా, సాహితి చాగంటి, సౌజన్య భగవతుల, వాగ్దేవి, అర్జున్, కార్తీక్ జయంతి వంటి ప్రముఖ గాయనీగాయకులు పాటలను ఆలపించారు. సాంకేతిక విభాగంలో వి.ఆర్.కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అన్ని హంగులతో సిద్ధమవుతోన్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఎలాంటి సక్సెస్‌ను సొంతం చేసుకుంటుందో తెలియాలంటే డిసెంబర్ 11 వరకు వెయిట్ చేయాల్సిందే.

ఇవి కూడా చదవండి:

పాన్ ఇండియా సినిమాల్లో ఆ మూడు బ్యానర్స్‌దే హవా

‘కింగ్ 100’లో కర్ణగా వెర్సటైల్ యాక్టర్.. ఫస్ట్ లుక్ అదిరింది

‘కాకా’ వర్సెస్ ‘విశ్వంభర’.. ఫ్యాన్స్‌‌లో గందరగోళం

Updated Date - Nov 09 , 2026 | 03:02 PM

హీరోయిన్‌ అతుల్య చంద్ర కేసులో బిగ్ ట్విస్ట్.. డాక్టర్‌పైనే అత్యాచారం కేసు!

శ్రీలీల.. వరుస అవకాశాల వెనుక అసలు సీక్రెట్ ఇదా

Ranbir Kapoor: రణ్‌బీర్‌ కపూర్‌.. సంచలన నిర్ణయం

వెన్నునొప్పితో నటుడు దర్శన్.. చికిత్సకు కోర్టు అనుమతి! న్యాయ‌వాదుల అభ్యంత‌రం

Nagarjuna: సోషల్ మీడియా అత్యంత క్రూరమైనది..