వెన్నునొప్పితో నటుడు దర్శన్.. చికిత్సకు కోర్టు అనుమతి! న్యాయ‌వాదుల అభ్యంత‌రం

ABN , Publish Date - Nov 08 , 2026 | 08:07 AM

రేణుకాస్వామి హత్య కేసులో విచారణ ఖైదీగా ఉన్న కన్నడ నటుడు దర్శన్‌కు వెన్నునొప్పి చికిత్స అందించేందుకు కోర్టు అనుమతించింది.

Darshan

వెన్నునొప్పితో బాధపడుతున్న నటుడు దర్శన్ (Darshan) చికిత్స పొందేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. చిత్రదుర్గ రేణుకాస్వామి (Renukaswamy Murder Case) హత్య కేసులో రెండో నిందితుడు, విచారణ ఖైదీగా పరప్పన అగ్రహార జైలు (Parappana Agrahara Jail) లో ఉన్న దర్శన్ చికిత్సకు అనుమతి ఇవ్వాలని కోర్టును ఆశ్ర యించారు. 59వ సీసీహెచ్ కోర్టు ఆయన పిటిషన్‌ను శనివారం విచారించింది. దర్శన్ చాలాకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్నారని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు.

గడిచిన 15 నెలలుగా జైలులో ఆయన నేలపైనే నిద్రిస్తున్నారని, చలి కారణంగా నొప్పి ఎక్కువైందని తెలిపారు. దీనికి ప్రభుత్వం తరపు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. గతంలోనూ వెన్నునొప్పి చికిత్స పేరిట బెయిల్‌పై బయటకు వచ్చి చికిత్స చేయించుకోలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలను విన్న అనంతరం, దర్శన్‌కు అవసరమైన ఫిజియోథెరపీ, వెన్నునొప్పి చికిత్స చేయించాలని జైళ్లశాఖ అధికారులను న్యాయాధికారి ఆదేశించారు.

Updated Date - Nov 08 , 2026 | 08:07 AM