శ్రీలీల.. వరుస అవకాశాల వెనుక అసలు సీక్రెట్ ఇదా
ABN , Publish Date - Nov 08 , 2026 | 12:37 PM
టాలీవుడ్లో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగి, తన గ్లామర్, ఎనర్జెటిక్ డాన్స్‌తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది శ్రీలీల (Sreeleela).
టాలీవుడ్లో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగి, తన గ్లామర్, ఎనర్జెటిక్ డాన్స్‌తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది శ్రీలీల (Sreeleela). ఎంట్రీలోనే వరుస ఆఫర్లతో ఒకానొక దశలో రోజుకు మూడు సినిమాల షూటింగ్లలో పాల్గొంటూ అత్యంత బిజీ నటిగా నిలిచిన ఈ చిన్నది ఆ తరువాత తెలుగులో అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. దీంతో కెరీర్‌ను సరైన ట్రాక్‌లోకి తెచ్చేందుకు శ్రీలీల తన దృష్టిని కోలీవుడ్, బాలీవుడ్ వైపు మళ్లించింది. ప్రస్తుతం అమ్మడి చేతిలో తమిళ్ సినిమాలు చాలానే ఉన్నాయి. అది కూడా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు. అదేంటి వరుస ప్లాపుల్లో కూడా శ్రీలీలకి ఎలా ఛాన్స్ ఇచ్చారు.. ఆ సీక్రెట్ ఏంటి అని టాలీవుడ్ గుసగుసలు మొదలయ్యాయి.
అయితే ఇతర భాషా చిత్రసీమల్లో నిలదొక్కుకోవడానికి శ్రీలీల తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఆమె కెరీర్ ని మళ్లీ వేగవంతం చేసిందని చెప్పుకొస్తున్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టాలి అనే సామెతని ఈ చిన్నది ఫాలో అయ్యింది. టాలీవుడ్లో ఒకప్పుడు ఒక్కో చిత్రానికి రూ. 2.5 కోట్ల వరకు చార్జ్ చేసిన ఈ భామ, కోలీవుడ్‌లో కొత్త ఆఫర్ల కోసం తన పారితోషికాన్ని దాదాపు సగానికి తగ్గించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కెరీర్ క్లిష్ట దశలో ఉన్నప్పుడు రెమ్యునరేషన్ కంటే అవకాశాలే ముఖ్యమని భావించిన శ్రీలీల, ఈ ప్రాక్టికల్ నిర్ణయంతో నిర్మాతల దృష్టిని ఆకర్షించినట్లు తెలుస్తోంది.
పారితోషికంలో కోత విధించినప్పటికీ, శ్రీలీలకు దక్కుతున్న ప్రాజెక్టులు మాత్రం చాలా పెద్దవి కావడం విశేషం. కోలీవుడ్‌లోని టాప్ హీరోలు, భారీ చిత్రాలలో ఆమెకు వరుసగా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. రజినీకాంత్, అజిత్ కుమార్, ధనుష్ వంటి దిగ్గజ స్టార్ల చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తూ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. తమిళంలో బిజీ ప్రాజెక్టులు దక్కించుకోవడం వెనుక శ్రీలీల అసలు సీక్రెట్ ఇదేనని సమాచారం. అంతేకాకుండా బాలీవుడ్లో కార్తీక్ ఆర్యన్ సరసన కూడా ఒక ప్రాజెక్ట్ చేస్తుండటం ఆమె పాన్-ఇండియా రేంజ్‌ను సూచిస్తోంది.
చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఉన్నంత వరకే డిమాండ్ ఉంటుంది. అయితే ఫ్లాప్‌ల ప్రభావం పడకుండా ఉండేందుకు సమయానికి తగినట్లు పారితోషికం తగ్గించుకుని అవకాశాలను చేజిక్కించుకోవడం శ్రీలీల సమయస్ఫూర్తికి నిదర్శనమని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం ఈ హాఫ్ రెమ్యునరేషన్.. డబుల్ ఆఫర్స్ వ్యూహంతో తమిళంలో బిజీగా మారిన శ్రీలీల, అక్కడ ఒక్క సాలిడ్ హిట్ కొడితే మళ్లీ తన పూర్వ వైభవాన్ని అందుకోవడమే కాకుండా రేస్‌లో అందరికంటే ముందంజలో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఎంత పారితోషికం తగ్గించినా.. సక్సెస్ అనేది కూడా ఉండాలి. అలా లేకపోతే ఆమె ఫ్రీ గా చేసినా కూడా అవకాశాలు రావు అని కొందరు చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాలతో అమ్మడు ఎలాంటి హిట్ ని అందుకుంటుందో చూడాలి.