‘కింగ్ 100’లో కర్ణగా వెర్సటైల్ యాక్టర్.. ఫస్ట్ లుక్ అదిరింది
ABN , Publish Date - Nov 08 , 2026 | 07:30 PM
టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జున అక్కినేని సినీ ప్రస్థానంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న మైలురాయి చిత్రం ‘కింగ్ 100’. తాజాగా ఈ మూవీలోని మరో పాత్రని మేకర్స్ పరిచయం చేశారు.
టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జున (King Nagarjuna) అక్కినేని సినీ ప్రస్థానంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న మైలురాయి చిత్రం ‘కింగ్ 100’ (King 100). అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై అత్యున్నత నిర్మాణ విలువలతో రూపొందుతోన్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు టాలెంటెడ్ డైరెక్టర్ రా కార్తీక్ (Ra Karthik) దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున కెరీర్లోనే ల్యాండ్‌మార్క్ మూవీ కావడంతో చిత్ర బృందం నటీనటుల ఎంపిక నుంచి ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఇప్పటికే చిత్రంలోని కీలక పాత్రలను ఒక్కొక్కటిగా పరిచయం చేస్తూ సినిమాపై భారీగా హైప్ క్రియేట్ చేస్తున్న మేకర్స్.. తాజాగా కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ అశోక్ సెల్వన్ (Ashok Selvan) పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో ఆయన ‘కర్ణ’ (Karna) అనే పవర్ఫుల్ అండ్ వైల్డ్ క్యారెక్టర్లో నటిస్తుండగా, విడుదలైన కాసేపట్లోనే ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో అశోక్ సెల్వన్ మునుపెన్నడూ చూడని ఇంటెన్స్ అవతార్‌లో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. పొడవాటి జుట్టు, ఒత్తైన గడ్డం, స్టైలిష్ మెరూన్ కలర్ షర్ట్ ధరించి కుర్చీలో కూర్చున్న ఆయన లుక్‌లో అదిరిపోయే యాటిట్యూడ్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. చేతిలో కాలుతున్న సిగరెట్, పక్కనే తగిలించి ఉంచిన ఖాకీ యూనిఫామ్, టేబుల్ ముందు భాగంలో ‘కింగ్ మూవ్’తో ఉన్న చెస్ బోర్డు.. ఈ పోస్టర్‌కు సరికొత్త మిస్టరీ వైబ్‌ను తెచ్చిపెట్టాయి. డార్క్ థీమ్ బ్యాక్‌డ్రాప్‌లో డిజైన్ చేసిన ఈ విజువల్ సినిమాలోని గ్రిప్పింగ్ నేచర్‌ను సూచిస్తోంది. తన కూల్ ఇమేజ్ను పక్కనపెట్టి ‘కర్ణ’ పాత్ర కోసం అశోక్ సెల్వన్ మారిన తీరు, ఆయన కళ్లలోని ఇంటెన్సిటీ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేశాయి. కథలో కింగ్ నాగార్జునతో ఈయన పాత్రకు ఎలాంటి లింక్ ఉండబోతోంది? ఈ ఇద్దరి మధ్య ఎలాంటి మైండ్ గేమ్స్ సాగనున్నాయి? అనే ఉత్కంఠ ఈ పోస్టర్‌తో ప్రేక్షకుల్లో మొదలైంది.
ఈ చిత్రంలో నాగార్జున, టబు, అశోక్ సెల్వన్ వంటి అద్భుతమైన తారాగణం నటిస్తుండటంతో సినిమా స్థాయి మరింత పెరిగింది. ఈ ప్రైడ్ ప్రాజెక్ట్‌కు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా, రాజా మహదేవన్ సినిమాటోగ్రాఫర్‌గా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా, సతీష్ కుమార్ ఎన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. ప్రమోషనల్ కంటెంట్‌తో మొదటి నుంచీ అంచనాలను పెంచుకుంటూ పోతున్న ‘కింగ్ 100’ చిత్రాన్ని ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా 2026 డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అత్యంత గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ మరోసారి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి:
‘కాకా’ వర్సెస్ ‘విశ్వంభర’.. ఫ్యాన్స్‌లో గందరగోళం
ఫ్లాప్ సినిమాను వందరోజులు ఆడించారు.. ఘట్టమనేని ఫ్యాన్స్ ప్రేమిస్తే ఇంతే..
ఎంగేజ్మెంట్ తర్వాత తేజ్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..