పాన్ ఇండియా సినిమాల్లో ఆ మూడు బ్యానర్స్‌దే హవా

ABN , Publish Date - Nov 08 , 2026 | 08:21 PM

పాన్ ఇండియా మూవీస్ అనగానే సౌత్ సినిమాలవైపే అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అందులోనూ దక్షిణాదికి చెందిన మూడు బ్యానర్స్ సినిమాలకే క్రేజ్ ఉండటం విశేషం. ఆ మూడు నిర్మాణ సంస్థలేవో చూద్దాం.

Pan India Production Houses

భారీ చిత్రాలు అంటే ఒకప్పుడు బాలీవుడ్‌కే సాధ్యమనే పేరుండేది. రెండు దశాబ్దాల నుంచి హిందీ చిత్రాలకు దీటుగా దక్షిణాది సినిమాలు రూపొందుతున్నాయి. పాన్ ఇండియా మూవీస్‌గా ఉత్తరాదివారినీ మన సౌత్ సినిమాలు పరవశింప చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సౌత్ ఇండియాకు చెందిన మూడు ప్రొడక్షన్ హౌసెస్ పేరు మారుమోగి పోతోంది. మన తెలుగు చిత్రసీమకు చెందిన మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers), తమిళ సినిమారంగా ‘సన్ పిక్చర్స్’ (Sun Pictures), కన్నడ చిత్రపరిశ్రమలో ‘హోంబలే ఫిలిమ్స్’ (Hombale Films) సంస్థల నుంచి వచ్చే సినిమాలకు నార్త్ లోనూ ఓ స్పెషల్ క్రేజ్ నెలకొని ఉందట. సన్ పిక్చర్స్ సంస్థ ‘జైలర్-2’తో కోలీవుడ్‌కు టాప్ గ్రాసర్‌ను అందించింది. సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా అట్లీ డైరెక్షన్‌లో ‘రాకా’ చిత్రాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో నిర్మిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్‌కు ముందే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించడంతో.. ‘రాకా’ కోసం యావద్భారతంలోని సినీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


ఒకప్పుడు కన్నడ చిత్రసీమ అంటే ఒకరిద్దరు స్టార్ హీరోస్ సినిమాలే భారీగా రూపొందేవి. మొత్తానికి కన్నడ సినిమారంగాన్ని ఓ చిన్న చిత్రపరిశ్రమగానే గుర్తించేవారు. హోంబలే ఫిలిమ్స్ సంస్థ భారీ చిత్రాలు నిర్మిస్తూ ఆల్ ఇండియాలోని సినీ ఫ్యాన్స్‌ను ఆకర్షించడం మొదలెట్టింది. ఈ సంస్థ అధినేత విజయ్ కిరగందూర్ నిర్మించిన పాన్ ఇండియా మూవీస్ ‘కేజీఎఫ్’ సిరీస్, ‘కాంతార’ సిరీస్, ‘సలార్’ సినిమా అభిమానులను విశేషంగా అలరించాయి. ‘కేజీఎఫ్-3, కాంతార-3, సలార్-2’ వంటి చిత్రాలు- ‘మహావతార్’ యానిమేషన్ సిరీస్ హోంబలే బ్యానర్ నుంచి రానున్నాయి. ఆ సినిమాలు ఎప్పుడు వస్తాయా? అని ఆల్ ఇండియాలోని సినీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Top-Production-Houses.jpg

తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మొదటి నుంచీ టాలీవుడ్ టాప్ స్టార్స్‌తో సినిమాలు నిర్మిస్తూ ఆకట్టుకుంటోంది. కొన్ని పాన్ ఇండియా మూవీస్‌తోనూ మైత్రీ అధినేతలు నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ సినీ ఫ్యాన్స్‌ను మురిపించారు. పుష్కర కాలం నుంచీ మైత్రీ మూవీ మేకర్స్ తెలుగు, తమిళ, హిందీ, మళయాళ భాషల్లో చిత్ర నిర్మాణం సాగిస్తున్నారు. ప్రభాస్ హీరోగా ఈ సంస్థ నిర్మిస్తోన్న ‘ఫౌజీ’, యన్టీఆర్ కథానాయకునిగా ‘డ్రాగన్’ చిత్రాల కోసం సినీ ఫ్యాన్స్ అమితాసక్తితో ఎదురుచూస్తున్నారు. రాబోయే రోజుల్లోనూ మైత్రీ మూవీమేకర్స్, సన్ పిక్చర్స్, హోంబలే ఫిలిమ్స్ - సంస్థలు ఇదే తీరున భారీ చిత్రాలతో అలరిస్తాయేమో చూడాలి.

ఇవి కూడా చదవండి:

‘కింగ్ 100’లో కర్ణగా వెర్సటైల్ యాక్టర్.. ఫస్ట్ లుక్ అదిరింది

‘కాకా’ వర్సెస్ ‘విశ్వంభర’.. ఫ్యాన్స్‌‌లో గందరగోళం

ఫ్లాప్ సినిమాను వందరోజులు ఆడించారు.. ఘట్టమనేని ఫ్యాన్స్ ప్రేమిస్తే ఇంతే..

Updated Date - Nov 08 , 2026 | 08:21 PM

Dragon Glimpse: పొరపాటున కూడా నా కల్లోకి రావొద్దు.. అదిరిపోయిన గ్లింప్స్ 

Fauzi: చరిత్రలో దాగిన అధ్యాయాల్లో.. అత్యంత ధైర్యవంతుడు 

Kantara 2: కాంతార సెట్‌లో మరణాలు.. రిషబ్‌కు పూజారులు హెచ్చరిక..

Jailer 2: 40 ఏళ్ల తర్వాత.. ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూసిన రజనీ

Raaka: అల్లు అర్జున్ ‘రాకా’.. తమిళ సినిమాగా ప్రచారం అందుకేనా?