‘కాకా’ వర్సెస్ ‘విశ్వంభర’.. ఫ్యాన్స్‌‌లో గందరగోళం

ABN , Publish Date - Nov 08 , 2026 | 05:57 PM

మెగాస్టార్ చిరంజీవి రెండు సినిమాల విషయమై ఫ్యాన్స్‌లో చర్చ సాగుతోంది. తన చిత్రాల గురించి అప్పుడప్పుడూ లీక్స్ ఇస్తూంటారు చిరంజీవి. అభిమానులు సైతం ‘చిరు లీక్స్’ను ఎంజాయ్ చేస్తూంటారు.. ఇప్పుడు ‘లీక్స్’ కాదు ‘క్లారిటీ’ కావాలి అంటున్నారు ఫ్యాన్స్.

Vishwambhara vs Kaaka

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) రెండు సినిమాల విషయమై ఫ్యాన్స్‌లో చర్చ సాగుతోంది. తన చిత్రాల గురించి అప్పుడప్పుడూ లీక్స్ ఇస్తూంటారు చిరంజీవి. అభిమానులు సైతం ‘చిరు లీక్స్’ (Chiru Leaks)ను ఎంజాయ్ చేస్తూంటారు.. ఇప్పుడు ‘లీక్స్’ కాదు ‘క్లారిటీ’ కావాలి అంటున్నారు ఫ్యాన్స్.. ఆ ముచ్చట్లోకి వెళితే..

చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందిన ‘విశ్వంభర’ (Vishwambhara) షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. వీఎఫ్ఎక్స్ వర్క్ వల్ల ఆలస్యమైనా, మూవీ అద్భుతంగా వచ్చిందని చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ కాంపౌండ్ న్యూస్. చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ‘కాకా’ చిత్రం సంక్రాంతి బరిలో దూకడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమాను జనవరి 13వ తేదీన విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారని, అందువల్ల దీనిని పొంగల్ బరి నుంచి తప్పించి.. ఆ స్థానంలో ‘విశ్వంభర’ను విడుదల చేస్తారనీ ఓ న్యూస్ హల్ చల్ చేసింది. దీనిని రచయిత కోన వెంకట్ (Kona Venkat) ఖండించారు. ‘కాకా’ (Kaaka) సినిమా తప్పకుండా జనవరి 13వ తేదీన వస్తోందని వెంకట్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో ట్వీట్ చేశారు. తాజాగా దీవాళి స్పెషల్‌గా మేకర్స్ వదిలిన పోస్టర్‌లో కూడా జనవరి 13 అని మరింతగా కన్ఫర్మ్ చేశారు. దీంతో చిరు ఫ్యాన్స్ గందరగోళానికి గురవుతున్నారు.


వాస్తవానికి ‘విశ్వంభర’ చిత్రం గత యేడాది సంక్రాంతికే రావలసి ఉంది. అప్పట్లో అనుకున్న స్థాయిలో గ్రాఫిక్స్ రూపొందని కారణంగా ఆలస్యమవుతుందని అన్నారు. పైగా రామ్ చరణ్‌ ‘గేమ్ చేంజర్’కు పోటీ కాకుండా తప్పుకుంటున్నట్టూ మేకర్స్ ప్రకటించారు. ఆ తరువాత చిరంజీవి తన వర్క్ పూర్తి చేసుకొని ‘మన శంకరవరప్రసాద్ గారు’తో సాగారు. ఆ సినిమా ఈ యేడాది సంక్రాంతికి రిలీజై విజయఢంకా మోగించింది. ఆ పై ‘కాకా’ సినిమాలో నటించడం ఆరంభించారు. మధ్యలో ‘విశ్వంభర’ను అలా గాలికి వదిలేశారేంటని పలుమార్లు ఫ్యాన్స్ చర్చించుకున్నారు. ఈ మధ్య తన ప్రతి చిత్రంపై ఏదో ఒక లీక్ ఇస్తూ ఫ్యాన్స్‌కు ఆసక్తి కలిగించే చిరంజీవి ‘విశ్వంభర’ గురించి ఏ లాంటి కామెంట్స్ చేయకపోవడం గమనార్హం! దాంతో నిర్మాతలే ఈ చిత్రాన్ని ఈ యేడాదిలోగా రిలీజ్ చేయాలని ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ‘విశ్వంభర’ దసరాకు వస్తుందనీ అప్పట్లో ప్రచారం సాగింది.. కానీ, అదీ జరగలేదు. పొంగల్ రేసు నుంచి ‘కాకా’ తప్పుకుంటే ఆ ప్లేస్‌లో ‘విశ్వంభర’ రావడం ఖాయమనుకున్నారు. కోన వెంకట్ ట్వీట్‌లో ‘కాకా’ వస్తున్నాడని పేర్కొన్నారు. మళ్ళీ అయోమయంలో ‘విశ్వంభర’ పరిస్థితి.


దసరాకు కాకపోతే డిసెంబర్‌లోనైనా ‘విశ్వంభర’ను రిలీజ్ చేయాలని మేకర్స్ ఆశించారు. కాకపోతే, పలు సినిమాలు ఉన్న కారణంగా వద్దనుకున్నారు.. ఇప్పుడు కొన్ని డిసెంబర్ రేస్ నుంచి తప్పుకున్నాయి. మరి మేకర్స్ ‘విశ్వంభర’ను డిసెంబర్‌లో రిలీజ్ చేస్తారా? అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి. అయితే చిరంజీవి మాత్రం తన టాక్ షో గురించి, ‘కాకా’ విషయాలు బయటకు లీక్స్ ఇస్తున్నారు తప్పితే.. ‘విశ్వంభర’ను మాత్రం పట్టించుకోవడం లేదు. అందువల్లే ఫ్యాన్స్ క్లారిటీ కావాలని అంటున్నారు. మరి ఈ విషయంపై మెగాస్టార్ ఏమైనా చెబుతారేమో చూడాలి.

ఇవి కూడా చదవండి:

ఫ్లాప్ సినిమాను వందరోజులు ఆడించారు.. ఘట్టమనేని ఫ్యాన్స్ ప్రేమిస్తే ఇంతే..

ఎంగేజ్‌మెంట్ తర్వాత తేజ్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..

వెంకీ విక్టరీకి అనిల్ రావిపూడినే దిక్కా..?

Updated Date - Nov 08 , 2026 | 05:57 PM

Kaaka: మెగాస్టార్ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్..

Kaaka: ‘కాకా’ షూటింగ్‌పై కీలక అప్డేట్‌..

Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి.. 'విశ్వంభర' హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి

Vishwambhara - Trisha: చిరంజీవి సరసన రెండోసారి! 

Vishwambhara: 'విశ్వంభర’ మహాద్రష్ట ఎవరంటే!