హీరోయిన్‌ అతుల్య చంద్ర కేసులో బిగ్ ట్విస్ట్.. డాక్టర్‌పైనే అత్యాచారం కేసు!

ABN , Publish Date - Nov 08 , 2026 | 05:50 PM

కొచ్చిలో అరెస్టైన 'మత్తు వదలరా' ఫేమ్ నటి అతుల్య చంద్ర కేసులో కొత్త మలుపు చోటుచేసుకుంది.

Athulya Chandra

కేరళలోని కొచ్చిలో అరెస్ట్ (Kochi Actress Arrest) అయిన మత్తు వదలరా (Mathu Vadalara) ఫేమ్ నటి అతుల్య చంద్ర (Athulya Chandra) కేసు కొత్త మలుపు తీసుకొంది. మొదట ఫిర్యాదు చేసిన డాక్టర్‌పై పోలీసులు అత్యాచారం, లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. డాక్టర్‌కు, నటి అతుల్య చంద్రతో గతంలో పరిచయం ఉంది.

ఈనెల 2వ తేదీన తన బంధువుల్లో ఒకరికి ఆరోగ్యం బాగోలేదని, అత్య వసరంగా వైద్య సహాయం అందించాలని ఆమె డాక్టర్‌కు ఫోన్ చేసి తాము ఉంటున్న అపార్ట్మెంట్‌కి రప్పించారు. ఆ సమయానికి అక్కడే ఉన్న మరికొందరు ఆ డాక్టర్‌ని ఓ గదిలో బంధించి దారుణంగా కొట్టారు. డాక్టర్ నుంచి మొబైల్ ఫోన్, స్మార్ట్ వాచ్, వైర్ లెస్ ఇయర్ ఫోన్‌ను అతుల్య లాక్కున్నారు. వారినుంచి ఎలాగోలా తప్పించుకున్న వైద్యుడు నేరుగా కడవంత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

ఆతుల్య చంద్రతో పాటు నటుడు, నిర్మాత బిబిన్ పెరుంబిల్లి (Bibin Perumbilli)ని పోలీసులు అరెస్టు చేశారు. మరో తొమ్మిది మంది కోసం గాలిస్తున్నారు. మరోవైపు నటికి మత్తు మందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ అతుల్య బంధువు డాక్టర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు డాక్టర్‌పై కూడా కేసు నమోదు చేశారు.

Updated Date - Nov 08 , 2026 | 06:01 PM