Ranbir Kapoor: రణ్‌బీర్‌ కపూర్‌.. సంచలన నిర్ణయం

ABN , Publish Date - Nov 08 , 2026 | 09:29 AM

బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక నటనకు స్వస్తి చెప్పి మెగా ఫోన్‌ పట్టాలనుకుంటున్నారు.

బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక నటనకు స్వస్తి చెప్పి మెగా ఫోన్‌ పట్టాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయన తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇటీవల ఆయన ‘రామాయణ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా శనివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. దర్శకుడిగా ఎందుకు మారాలనుకుంటున్నారో వివరించారు.

"ఈ మధ్యనే నా ఆలోచన తీరు మారింది. ఈ జర్నీలో వాట్ నెక్స్ట్ అని ఆలోచించినప్పుడు.. ఇంకేమైనా కొత్తగా చేయాలనిపించింది. బాగా అలోచించి దర్శకుడిగా మారాలనుకున్నా. ఇక దర్శకత్వానికే ఎక్కువ సమయం కేటాయించాలనుకుంటున్నా. నటుడిగా నేను ఏడాదికి 100 నుంచి 125 రోజులు మాత్రమే పని చేస్తాను. మిగతా సమయం ఖాళీనే.  కాబట్టి కథలు రాయడానికి నాకు టైం కుదురుతుంది. నటుడిగా ఇది నా చివరి దశాబ్దం అనుకుంటా. ‘బ్రహ్మాస్త్ర 2’, ‘యానిమల్‌ 2’, ‘రామాయణం పార్ట్‌ 2’ పూర్తి చేసి రెండు మూడేళ్లలో దర్శకత్వం చేయాలనుకుంటున్నా. నా దర్శకత్వంలో వచ్చే సినిమాల్లో నేను నటించాలనుకోవడం లేదు.  ప్రేక్షకుల్లో ఎఫక్షన్, హోప్ కలిగించే కథలకే నేను ఎక్కువగా ఎట్ట్రాక్ట్ అవుతాను. రాజ్‌కుమార్‌ హిరానీ తరహాలోనే అందరికీ నచ్చే ఒక ఫీల్‌ గుడ్‌ డ్రామానే చేయాలను కుంటున్నా"
అన్నారు. 


కథ రాయడం కష్టం.. 

'నాకు రచయితల పట్ల ఎంతో గౌరవం ఉంది. అసలు ఒక కథను రైటర్స్ ఎలా రాస్తారా..?’ అని ఎప్పుడూ ఆలోచిస్తుంటాను.  సంగీత దర్శకుడి తర్వాత, నిజమైన ఆనందాన్ని పొందే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది దర్శకుడే అని నేను నమ్ముతాను. ఎందుకంటే ఒక సినిమాకి దర్శకత్వం వహించేటప్పుడు అది మంచిదైనా చెడ్డదైనా.. కథను చెప్పే అవకాశం దొరకడం, ఆ కథను చెప్పడానికి ఇంతమందిని ఒకచోట చేర్చడం అనేది ఒక అద్భుతమైన అనుభవం. నేను కూడా అలా చేయగలనని నమ్ముతున్నాను.  రెండు నెలల క్రితం ఒక కథ రాయడం మొదలుపెట్టా.  కథను సృష్టించడం చాలా కష్టం' అని అర్థమయింది. 

ALSO READ:

Diwali: అమ్మతో అనుబంధం.. మట్టి దీపాల అందం.. తారల దీపావళి విశేషాలు

Nayanthara: నయనతారకు వరుస షాకులు.. ఈ ఏడాది హ్యాట్రిక్ ఫ్లాప్స్!

‘భోగి’ ఈవెంట్ వాయిదా.. ఆ చిక్కే కారణమా

Updated Date - Nov 08 , 2026 | 10:43 AM