Ramayana: ‘జతగూడె’.. కన్నుల పండువగా సీతారాముల కళ్యాణం సాంగ్
ABN , Publish Date - Oct 29 , 2026 | 09:48 PM
భారతీయ ఇతిహాసాల్లో అత్యున్నతమైన గ్రంథం రామాయణాన్ని వెండితెరపై కనీవినీ ఎరుగని రీతిలో ఆవిష్కరిస్తున్నారు ప్రముఖ నిర్మాత నమిత్ మల్హోత్రా. ‘దంగల్’ ఫేమ్ నితేశ్ తివారీ దర్శకత్వంలో అసాధారణ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ విజువల్ ఎపిక్ చిత్రం ‘రామాయణం’. ఈ సినిమా నుంచి ‘జతగూడె’ సాంగ్ విడుదలైంది.
భారతీయ ఇతిహాసాల్లో అత్యున్నతమైన గ్రంథం రామాయణాన్ని వెండితెరపై కనీవినీ ఎరుగని రీతిలో ఆవిష్కరిస్తున్నారు ప్రముఖ నిర్మాత నమిత్ మల్హోత్రా (Namit Malhotra). ‘దంగల్’ ఫేమ్ నితేశ్ తివారీ (Nitesh Tiwari) దర్శకత్వంలో అసాధారణ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ విజువల్ ఎపిక్ చిత్రం ‘రామాయణం’ (Ramayana). శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా సాయిపల్లవి నటిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ నుంచి తాజాగా సీతారాముల పవిత్ర వివాహ వేడుకను ప్రతిబింబించే అందమైన మెలోడీ గీతం ‘జతగూడె’ (Jatha Goode Song) విడుదలైంది. ప్రస్తుతం ఈ పాట అన్ని మ్యూజిక్ ప్లాట్‌ఫామ్‌లలో మంచి ఆదరణను రాబట్టుకుంటోంది.
ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ ఈ పాటకు భక్తి, అనురాగం మేళవించిన అద్భుతమైన స్వరాలను సమకూర్చారు. రాకేందు మౌళి అందించిన సుమధురమైన తెలుగు సాహిత్యానికి గాయని శిరీష భాగవతుల తన మంత్రముగ్ధమైన గాత్రంతో ప్రాణం పోశారు. పాటలో సీతారాముల కళ్యాణ మహోత్సవం, వరమాల ధారణ, అనంతరం అయోధ్యను దాటి సాగే పవిత్ర ప్రయాణ దృశ్యాలను విజువల్ వండర్‌గా తీర్చిదిద్దారు. ముఖ్యంగా రణ్‌బీర్ కపూర్-సాయిపల్లవిల మధ్య పలికిన భావోద్వేగాలు, వారిద్దరి మధ్య సాగిన సంభాషణలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
ఈ భారీ ప్రాజెక్ట్‌లో రావణాసురుడిగా రాకింగ్ స్టార్ యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్నారు. నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, ఎనిమిది ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న అంతర్జాతీయ సంస్థ డీఎన్ఈజీ (DNEG), యశ్‌కు చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ పంపిణీ సంస్థ ఎస్వీసీ (SVC) ద్వారా విడుదల కానుండగా, హిందీలో ధర్మ ప్రొడక్షన్స్, అంతర్జాతీయంగా సోనీ పిక్చర్స్ విడుదల చేస్తున్నాయి. రెండు భాగాలుగా రానున్న ఈ ఎపిక్‌లో మొదటి భాగం ఐమ్యాక్స్ ఫార్మాట్లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 5 నవంబర్, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఇవి కూడా చదవండి:
‘ఆకాశంలో ఒక తార’.. మనసును తాకేలా ‘రాధే రాధే’ సాంగ్ విడుదల
అడుగెట్టాడు.. రవితేజ ‘తులాభారం’ క్రేజీ అప్డేట్
గొప్ప సందేశంతో ‘డియర్ ఆస్ట్రోనాట్’.. అందరూ చూడాలి: శేఖర్ కమ్ముల