Ramayana-Namit malhotra: నచ్చకపోతే మా ఫెయిల్యూర్‌గానే భావిస్తాం
ABN , Publish Date - Aug 24 , 2025 | 01:15 PM
బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణ’ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రా రూ. 4000 కోట్లతో నిర్మిస్తున్నారు.
బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణ’ (Ramayana) ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రా (Namit malhotra) రూ. 4000 కోట్లతో నిర్మిస్తున్నారు. రెండు పార్టులుగా ఈ చిత్రాన్ని హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కిస్తున్నారు. భారతీయ సినిమాపై ప్రపంచం చిన్నచూపు చూసినప్పుడు తాను ఎంతో నిరాశకు గురయ్యానని, ‘రామాయణ’తో ప్రపంచమంతా భారత్ వైపు చూస్తుందన్న నమ్మకం ఉందని నమిత్ గతంలో చెప్పారు. ఇలా ఈ చిత్రంపై నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ, అప్‌డేట్స్ ఇస్తూ అంచనాలు రెట్టింపు చేస్తున్నారు.
తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతీయ సినీ ప్రేక్షకులే కాదు, పాశ్చాత్య దేశాల వారికీ ఈ సినిమా నచ్చకపోతే మా ఫెయిల్యూర్‌గానే భావిస్తాం’ అంటూ తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ సినిమాపై ఎంత నమ్మకంగా ఉన్నారో తెలిపారు. ‘అవతార్’, ‘గ్లాడియేటర్’ తదితర హాలీవుడ్ చిత్రాల స్థ్థాయిలో ‘రామాయణ’ ఉంటుందన్నారు. ఈ సినిమాతో రామాయణం గురించి ప్రపంచానికి తెలియజేయాలన్నది తమ ఉద్దేశమని అన్నారు. నితీశ్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. తొలి భాగాన్ని 2026 దీపావళికి, రెండోభాగం 2027 దీపావళికి రానున్నాయి.