‘ఆకాశంలో ఒక తార’.. మనసును తాకేలా ‘రాధే రాధే’ సాంగ్ విడుదల

ABN , Publish Date - Oct 29 , 2026 | 09:05 PM

వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తోన్న సరికొత్త చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది.

Aakasamlo Oka Tara

వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా నటిస్తోన్న సరికొత్త చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ (Aakasamlo Oka Tara). టాలెంటెడ్ డైరెక్టర్ పవన్ సాధినేని (Pavan Sadineni) దర్శకత్వంలో ఓ వినూత్న భావోద్వేగ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా సంయుక్త సమర్పణలో సందీప్ గున్నం, రమ్య గున్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా పరిచయమవుతుండగా.. శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్లకు అనూహ్య స్పందన రాగా.. తాజాగా చిత్ర మ్యూజికల్ ప్రమోషన్స్‌ను గ్రాండ్‌గా ప్రారంభిస్తూ ఫస్ట్ సింగిల్ ‘రాధే రాధే’ (Radhe Radhe) పాటను విడుదల చేశారు.


సాధారణంగా ప్రజలు గుజరాత్‌కు వెళ్లడానికి రెండు ప్రధాన కారణాలుంటాయి.. ఒకటి ద్వారకాధీశుడిని దర్శించుకోవడం, రెండోది బొగ్గు గనుల్లో కష్టపడి పనిచేయడం. హీరో దుల్కర్ సల్మాన్, ‘బిజిలీ’ పాత్రధారి రుహాని శర్మ మధ్య సాగే ఆసక్తికర సంభాషణతో ఈ పాటను పరిచయం చేసిన తీరు సినిమాపై క్యూరియాసిటీని పెంచేసింది. విడుదలైన పూర్తి పాటను గమనిస్తే.. హీరో తన జీవిత పోరాటంలో భాగంగా బొగ్గు గనుల్లో పనిచేయడానికి గుజరాత్‌కు వెళ్లిన నేపథ్యాన్ని ఆవిష్కరించారు. కథానాయకుడు పడే శ్రమ, అతని అంతరంగంలో దాగున్న మౌనం, అన్నింటికీ మించి ఆ కష్టమైన ప్రయాణం వెనుక ఉన్న స్వచ్ఛమైన ప్రేమను గీత రచయిత శ్రీమణి ఎంతో భావోద్వేగంగా తన సాహిత్యంలో బంధించారు.


హృదయాలను హత్తుకునే మెలోడీలను స్వరపరచడంలో తనకంటూ తిరుగులేని శైలిని సొంతం చేసుకున్న జీవీ ప్రకాశ్ కుమార్.. ఈ పాటకు అద్భుతమైన ట్యూన్ అందించడమే కాకుండా స్వయంగా ఆలపించి ప్రాణం పోశారు. ఆయనతో కలిసి సింగర్ లిప్సిక భాష్యం తన మధురమైన గాత్రంతో పాటకు మరింత అందాన్ని చేకూర్చారు. తెరపై దుల్కర్ సల్మాన్ ఏదో నిజాన్ని దాచుకుంటూ, బరువైన గుండెతో కష్టాలను భరించే వ్యక్తిగా తన కళ్లలోని భావాలతోనే నటించి మెప్పించారు. బిజిలీగా రుహాని శర్మ ఆయన పక్కన కనిపించిన తీరు బాగుంది. సుజిత్ సారంగ్ విజువల్స్, శ్వేత సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైన్‌తో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం.. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో మొదటి అడుగుతోనే శ్రోతల మనసులను గెలుచుకుంది. పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతున్న ‘ఆకాశంలో ఒక తార’ చిత్రం నవంబర్ 20న తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి:

అడుగెట్టాడు.. రవితేజ ‘తులాభారం’ క్రేజీ అప్‌డేట్

గొప్ప సందేశంతో ‘డియర్ ఆస్ట్రోనాట్’.. అందరూ చూడాలి: శేఖర్ కమ్ముల

నాగబాబు విడుదల చేసిన ‘మైలురాయి’ టైటిల్ లుక్

Updated Date - Oct 29 , 2026 | 09:05 PM

Aakasam Lo Oka Tara: ఆకాశంలో ఒక‌ తార.. హీరోయిన్ ఫ‌స్ట్ లుక్ అదిరింది

Aakasam Lo Oka Tara: దుల్క‌ర్ 'ఆకాశంలో ఒక తార‌'.. కొత్త‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

AakasamLo Oka Tara: దుల్క‌ర్ స‌ల్మాన్ మ‌రో తెలుగు సినిమా.. ‘ఆకాశంలో ఒక తార’

Aakasamlo Oka Tara: చిట్టి చిట్టి చీమ.. ఎంత వినసొంపుగా ఉందమ్మా

Aakasamlo Oka Tara: దుల్కర్ సినిమాలో బిజిలీగా..