Ramayana : రావణుడొచ్చాడు!
ABN , Publish Date - Feb 23 , 2025 | 04:37 AM
రావణుడు వచ్చేశాడు.. శ్రీరామునిపై యుద్ధం ప్రారంభించాడు. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్న ‘రామాయణ’ చిత్రంలో కన్నడ హీరో యశ్ రావణుడి పాత్ర పోషిస్తున్న...
రావణుడు వచ్చేశాడు.. శ్రీరామునిపై యుద్ధం ప్రారంభించాడు. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్న ‘రామాయణ’ చిత్రంలో కన్నడ హీరో యశ్ రావణుడి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తన తాజా చిత్రం ‘టాక్సిక్’ కోసం ప్రస్తుతం ముంబైలోనే ఉన్న యశ్ ఇప్పుడు ‘రామాయణ’ మీద దృష్టి పెట్టారు. శుక్రవారం ముంబైలోని అక్సా బీచ్‌లో కీలకమైన యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించారు. అందులో యశ్ పాల్గొన్నారు. విజువల్ ఎఫెక్ట్స్‌కు ఎంతో ప్రాధాన్యం ఉన్న సన్నివేశాలను చిత్రీకరించినట్లు యూనిట్ సభ్యులు చెప్పారు. నితీశ్ తివారీ దర్శకత్వంలో రెండు భాగాలుగా ‘రామాయణ’ చిత్రం తయారవుతోంది. తొలి భాగం వచ్చే ఏడాది దీపావళికి విడుదలవుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
Read Latest AP News And Telugu News