అడుగెట్టాడు.. రవితేజ ‘తులాభారం’ క్రేజీ అప్‌డేట్
ABN , Publish Date - Oct 29 , 2026 | 08:17 PM
మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కలయికలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘తులాభారం’. ఈ మూవీకి సంబంధించి మేకర్స్ ఓ క్రేజీ అప్‌డేట్ వదిలారు.
మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja), టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ (Vivek Athreya) కలయికలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘తులాభారం’ (Thulabharam). రవితేజ మార్క్ అన్‌స్టాపబుల్ ఎనర్జీకి, వివేక్ ఆత్రేయ యూనిక్ స్క్రీన్‌ప్లే, స్టోరీ టెల్లింగ్ తోడై క్రైమ్, డ్రామా, ఫుల్-ఆన్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ చిత్రాన్ని సరికొత్తగా తీర్చిదిద్దుతున్నారు. ఇటీవలే బ్లాక్‌బస్టర్ ‘ఇరుముడి’తో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న రవితేజ.. పూర్తి జోష్‌తో ఈ సినిమాతో తనలోని సరికొత్త కోణాన్ని చూపించేందుకు సిద్ధమయ్యారు. బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ పతాకంపై లక్ష్మణ్, శ్రీనిరావు ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఇటీవల విడుదలైన ‘తులాభారం - ది టైటిల్ డాక్యుమెంటరీ’ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకుల హృదయాల్లో ‘మాస్ మహారాజా’గా చెరగని ముద్ర వేసుకున్న రవితేజ.. ఈ చిత్రంతో ‘క్రైమ్ మహారాజా’గా సరికొత్త ట్యాగ్‌తో సరికొత్త ఐడెంటిటీని సొంతం చేసుకోబోతున్నారు. ‘నవ రవితేజం’ పేరుతో ఆయన కెరీర్‌లో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ వచ్చిన ఆ కాన్సెప్ట్ వీడియో సినిమాపై అంచనాలను ఒక్కసారిగా తారాస్థాయికి చేర్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు.
ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కాగా, తాజాగా హీరో రవితేజ తన ఫస్ట్ డే షూట్‌లో గ్రాండ్‌గా అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆయనతో పాటు కీలక నటీనటులపై ప్రధాన సన్నివేశాల చిత్రీకరణను శరవేగంగా జరుపుతున్నారు. రవితేజ అడుగు పెట్టినట్లుగా చెబుతూ, మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. కచ్చితంగా ఈ సినిమాతోనూ మంచి సక్సెస్‌ని రవితేజ తన ఖాతా వేసుకుంటాడని ఆయన అభిమానులు భావిస్తున్నారు. ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్, ప్రియాంక మోహన్, అనస్వర రాజన్, సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి, అనిల్ కరెళ్ల, రవి ఆంటోనీ వంటి ప్రతిభావంతులైన తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు. సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ ‘తులాభారం’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:
గొప్ప సందేశంతో ‘డియర్ ఆస్ట్రోనాట్’.. అందరూ చూడాలి: శేఖర్ కమ్ముల
నాగబాబు విడుదల చేసిన ‘మైలురాయి’ టైటిల్ లుక్
కథలు వినడం మానేసిన అనుపమ.. కారణం ఏంటి?