రామ్ చరణ్.. హోంబలే ఫిల్మ్స్.. మొదలు!
ABN, Publish Date - May 14 , 2026 | 03:37 PM
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, హోంబలే ఫిల్మ్స్ మొదలు అనగానే ఈ కాంబోలో సినిమా ఏమైనా సెట్ అయిందేమోనని అనుకుంటారేమో.. అలాంటిదేమీ లేదు. రామ్ చరణ్ చేస్తున్న ‘పెద్ది’ సినిమానే చేతులు మారింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), హోంబలే ఫిల్మ్స్ (Hombale Films) మొదలు అనగానే ఈ కాంబోలో సినిమా ఏమైనా సెట్ అయిందేమోనని అనుకుంటారేమో.. అలాంటిదేమీ లేదు. భారతీయ చలనచిత్ర రంగంలో అగ్రగామి నిర్మాణ సంస్థగా గుర్తింపు పొందిన హోంబలే ఫిల్మ్స్, తాజాగా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి ప్రవేశిస్తున్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ (Peddi) సినిమాతో ఈ సంస్థ తన ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూషన్ ప్రస్థానాన్ని ప్రారంభిస్తోంది. ఈ మేరకు సదరు సంస్థ నుంచి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ విషయమే మొన్నటి వరకు ప్రత్యంగిర సినిమాస్ పేరు వినిపించింది. ఇప్పుడా సంస్థ నుంచి హోంబలే సంస్థకు ‘పెద్ది’ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ (Overseas Distribution) రైట్స్ రావడం వెనుక ఏం జరిగిందనేది మాత్రం తెలియాల్సి ఉంది.
హోంబలే ఫిల్మ్స్ విషయానికి వస్తే.. ‘కెజియఫ్, కాంతార, సలార్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో భారతీయ సినిమా స్థాయిని పెంచిన సంస్థ ఇది. ఇప్పుడు 2026లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియన్ మూవీ ‘పెద్ది’తో నేరుగా అంతర్జాతీయ మార్కెట్‌లోకి ప్రవేశిస్తోంది. మట్టి వాసన ఉన్న కథలను భారీ విజువల్స్‌తో తెరకెక్కించే ఈ సంస్థకు దేశ విదేశాల్లో విశేషమైన ఆదరణ ఉంది. ఇప్పుడీ చిత్రంతో ఈ సంస్థ అంతర్జాతీయ ఉనికి మరింత బలోపేతం కానుందని సంస్థ నిర్వాహకులు భావిస్తున్నారు.
‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) తెరకెక్కిస్తున్న ఈ ‘పెద్ది’ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ పవర్‌ఫుల్ ట్రాన్స్‌ఫర్మేషన్, రా యాక్షన్ నేపథ్యంతో ఇప్పటికే భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండటం ఈ ప్రాజెక్టుకు మరో ప్రధాన ఆకర్షణ. హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్ర ఓవర్‌సీస్ హక్కులను దక్కించుకోవడంతో, విదేశాల్లో ఈ సినిమా అత్యంత భారీ స్థాయిలో విడుదలయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రామ్ చరణ్ అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. జూన్ 03 నుంచి ప్రీమియర్స్ పడనున్నాయి.
ఇవి కూడా చదవండి:
Tollywood: డూప్లికేట్ జుత్తు, పాము.. సునీల్ నారంగ్ వర్సెస్ నాగవంశీ!
నిన్న ఆలీ.. నేడు రాజీవ్ కనకాల.. ఇలాంటి ఇబ్బందులు తప్పవు మరి!
ట్రెండింగ్‌లో మహేష్ బాబు కొడుకు పాట.. హిట్టు కొడుతున్నట్టేనా?
పరిష్కారం కోసమా? పరువు తీసుకోవడానికా?.. ఇండస్ట్రీ రచ్చపై మధుర శ్రీధర్