సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఇప్పుడు నెంబర్ వన్ హీరో ఎవరంటే? - రాజశేఖర్

ABN, Publish Date - Apr 08 , 2026 | 08:05 PM

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ ఓ విషయంపై చర్చలు నడుస్తుంటాయి. టాలీవుడ్ నెంబర్ వన్ హీరో ఎవరు? అంటూ, స్టార్ హీరోల పేర్లు చాలానే వినిపిస్తూ ఉంటాయి. ఈ చర్చలు మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లి, సినిమాలకు గ్యాప్ ఇచ్చినప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి.

Rajasekhar

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ ఓ విషయంపై చర్చలు నడుస్తుంటాయి. టాలీవుడ్ నెంబర్ వన్ హీరో ఎవరు? అంటూ, స్టార్ హీరోల పేర్లు చాలానే వినిపిస్తూ ఉంటాయి. ఈ చర్చలు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) రాజకీయాల్లోకి వెళ్లి, సినిమాలకు గ్యాప్ ఇచ్చినప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి. మళ్లీ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చి, హిట్స్ కొడుతున్నారు. దీంతో కొంతకాలంగా ఈ చర్చలకు ఫుల్ స్టాప్ పడిందనే చెప్పాలి. అందులోనూ ఇప్పుడూ నెంబర్ వన్ హీరో అని చెప్పుకోవడానికి అవకాశం లేకుండా, హీరోలందరూ హిట్స్ కొడుతున్నారు. అప్పటి స్టార్ హీరోలు, ఇప్పటి కుర్ర హీరోల సినిమాలలో నటిస్తున్నారు. ఈ క్రమంలో ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో ఎవరనేది కాకుండా, మంచి హిట్ ఎవరికి పడిందనే దానిపైనే లెక్కలు వేసుకుంటున్నారు. ఇప్పుడు డాక్టర్ రాజశేఖర్ (Dr Rajasekhar) కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.


చాలా గ్యాప్ తర్వాత ఆయన నటించిన చిత్రం ‘బైకర్’ (Biker Movie). ఇందులో ఆయన హీరో శర్వానంద్‌కు తండ్రిగా నటించారు. ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన హాజరైన ఓ ఇంటర్వ్యూలో.. మీరు ఒకప్పుడు స్టార్ హీరో కదా.. ఇప్పుడు శర్వానంద్ సినిమాలో ఇలాంటి పాత్ర చేయడానికి ఎలా అంగీకరించారనే ప్రశ్న ఆయనకు ఎదురైంది. దీనికి రాజశేఖర్ సమాధానమిస్తూ.. ‘‘మొదట అవకాశం వచ్చినప్పుడు ఈ పాత్ర చేద్దామా వద్దా? అని ఆలోచించా. మా అమ్మాయిలిద్దరూ ఈ సినిమా చేయాలని పట్టుబట్టారు. జీవితతో పాటు మా అమ్మాయిలిద్దరూ కూడా నాకు కోచ్‌లే. ఈ సినిమాలో పాత్ర గురించి తెలిసిన తర్వాత మా మధ్య (Rajasekhar Family) డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్‌లో ‘ఇది చేయాలి, మీరు నిర్ణయించుకున్నారు కదా!’ అని వాళ్లు అంటే.. ‘శర్వా సినిమాలో మనం చేయడం ఎలా ఉంటుంది? షూట్ అవుతుందా?' అని నేను అడిగాను.


దానికి వాళ్ళు.. ‘అదంతా ఏం లేదు డాడీ.. ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్ అంతా మీ కాలంలోనే! ఇప్పుడు అన్నీ మారిపోయాయి. ఎవరు సక్సెస్‌లో ఉన్నారో వాళ్లే విషయం ఉన్నవాళ్లు. కాబట్టి మీకు ఇష్టమైతే ఈ క్యారెక్టర్ చేయండి’ అని ముగ్గురూ అన్నారు. వాళ్లు చెప్పింది అంతా విన్న తర్వాత.. ‘సరే, కరెక్టే’ అని, నేను తీసుకున్న నిర్ణయం ఇవాళ ఇంత సక్సెస్ అయింది’’ అని తెలిపారు. నిజమే, రాజశేఖర్ కనుక ఈ పాత్ర చేయకుండా ఉండి ఉంటే మాత్రం, ఈ సినిమా ఇంతగా బాక్సాఫీస్ వద్ద నిలబడేది కాదు. సినిమా చూసిన వారంతా శర్వా తండ్రిగా రాజశేఖర్ చేసిన నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారంటే, ఆయన ఎంతగా ఈ పాత్రను రక్తికట్టించారో అర్థం చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

స్క్రీన్స్ తక్కువ.. క్రేజ్ ఎక్కువ! డ్యూన్ మేనియా షురూ.. ఒక్కో టికెట్ 90 వేలు

అఖిల్ బర్త్‌డే స్పెషల్‌గా.. ‘లెనిన్’ న్యూ పోస్టర్ విడుదల

ఆమనికి తెలంగాణ బీజేపీలో పదవి...

Updated Date - Apr 08 , 2026 | 08:34 PM