Biker: బైకర్ నుంచి బుల్లెట్ సునీల్ గ్లింప్స్! ఎన్నాళ్లైంది రాజశేఖర్‌ను ఇలా చూసి!!
ABN , Publish Date - Feb 04 , 2026 | 10:48 AM
సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్న శర్వానంద్ (Sharwanand) ఇప్పుడు ట్రాక్ మార్చి రేసర్‌గా అలరించేందుకు సిద్ధమయ్యారు.
సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్న శర్వానంద్ (Sharwanand) ఇప్పుడు ట్రాక్ మార్చి రేసర్‌గా అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘బైకర్’ (Biker). అభిలాష్ రెడ్డి కంకర (Abhilash Reddy Kankara) దర్శకత్వంలో యువీ క్రియేషన్స్ (UV Creations) ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. యాంగ్రీ యంగ్ మెన్ హీరో రాజశేఖర్ కీలక పాత్ర చేస్తున్నాడు.
ఇందులో మాళవికా నాయర్ (Malvika Nair) కథానాయిక. మంగళవారం మేకర్స్ విడుదల తేదీని ప్రకటించగా బుధవారం రాజశేఖర్ పాత్ర బుల్లెట్ సునీల్ క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ చిన్న గ్లింమ్స్ విడుదల చేసి ఏప్రిల్ 3న ‘బైకర్’ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కాగా సినిమాలో రిటైర్ అయిన బైకర్‌గా రాజశేఖర్ కనిపించగా ఆ పై శర్వానంద్‌కు కోచ్ పాత్ర చేసినట్లు అర్థమవుతోంది. వంశీ-ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ (Ghibran Vaibodha) సంగీతం అందిస్తున్నాడు.