Biker First Lap: ఏం జరిగినా పట్టు వదలని మొండోడి కథ.. అదిరిపోయిన బైకర్ గ్లింప్స్
ABN , Publish Date - Nov 01 , 2025 | 04:51 PM
కుర్ర హీరో శర్వానంద్(Sharwanand) ప్రస్తుతం ఒక మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. అందులో భాగంగానే వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.
Biker First Lap: కుర్ర హీరో శర్వానంద్(Sharwanand) ప్రస్తుతం ఒక మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. అందులో భాగంగానే వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారీ (Nari Nari Naduma Murari)ని రంగంలోకి దింపిన శర్వా దానికన్నా ముందే బైకర్(Biker) ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. శర్వానంద్, మాళవిక నాయర్ జంటగా అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బైకర్. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ కృష్ణా రెడ్డి & ఉప్పలపాటి ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా బైకర్ నుంచి ఫస్ట్ గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లాప్ అనే పేరుతో రిలీజ్ చేసిన ఈ గ్లింప్స్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. టైటిల్ కి తగ్గట్లే బైకర్ గా శర్వానంద్ నటిస్తున్నాడు. ' ఇక్కడ ప్రతి బైకర్ కు ఒక కథ ఉంటుంది. సమయంతో పోరాడే కథ.. చావుకు ఎదురెళ్ళే కథ. ఏం జరిగిన పట్టువదలని మొండోళ్ల కథ. అంటూ శర్వా బైకర్ గా రేస్ లో పాల్గొన్న సీన్స్ ను చూపించారు. ఇక చివర్లో గెలవడం గొప్పకాదు.. చివరిదాకా పోరాడడం గొప్ప అంటూ సినిమా లైన్ ను చెప్పుకొచ్చారు.
ఇక బైకర్ గా శర్వా లుక్ ఆకట్టుకొంటుంది. ఈ సినిమా కోసమే ఈ కుర్ర హీరో సన్నబడ్డట్లు తెలుస్తోంది. జిబ్రాన్ మ్యూజిక్ చాలా ఫ్రెష్ గా ఉంది. ఇకపోతే ఈ సినిమా డిసెంబర్ 6 న ప్రేక్షకుల ముందుకు రానుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న బైకర్ తో శర్వా ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Kanchana 4: ఇటు పూజా హెగ్డే, అటు నోరా ఫతేహీ నడుమ లారెన్స్...
Chiyaan Vikram: నూతన దర్శకుడితో విక్రమ్ 63