స్క్రీన్స్ తక్కువ.. క్రేజ్ ఎక్కువ! డ్యూన్ మేనియా షురూ.. ఒక్కో టికెట్ 90 వేలు

ABN , Publish Date - Apr 08 , 2026 | 06:41 PM

సాధారణంగా క్రేజ్ ఉన్న ఏదైనా సినిమా టికెట్ ఎంత ఉంటుంది.. ఏ వెయ్యో, మహా అయితే మూడు వేలో ఉంటుంది. కానీ ఆ మూవీ టిక్కెట్‌ ధర మాత్రం అంతకు మించి ఉంది. అంతేకాదు... ఎంత డబ్బులు పెట్టినా టికెట్ దొరకడం కష్టంగా మారింది. ఇంతకీ అంత డిమాండ్ ఉన్న మూవీ ఏంటి!? అసలెందుకు ఆ సినిమాకు అంత క్రేజ్!?

Dune

హాలీవుడ్ విజువల్ మాస్టర్ డెనిస్ విల్లెనెవ్ రూపొందించిన 'డ్యూన్: పార్ట్ త్రీ' పై ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ యేడాది డిసెంబర్ 18న విడుదల కానున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డులు సృష్టిస్తోంది. ఐమ్యాక్స్ 70ఎం.ఎం. ఫార్మాట్ టికెట్లు నిమిషాల్లోనే అమ్ముడైపోయాయి. అంతేకాక బ్లాక్ మార్కెట్‌లో ఒక్కో టికెట్ ధర ఏకంగా 90 వేల రూపాయల వరకు పలుకుతుండటం సంచలనంగా మారింది. అసలు ఈ సినిమాకు ఇంత క్రేజ్ ఎందుకు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.


'డ్యూన్: పార్ట్ త్రీ'కు ఇంత క్రేజ్ రావడానికి, టికెట్ రేట్ల ఇంత భారీగా ఉండటానికి ప్రధాన కారణం ఐమ్యాక్స్ 70 ఎం.ఎం. ఈ టెక్నాలజీతో నడిచే థియేటర్లు పరిమిత సంఖ్యలో ఉన్నాయి. అమెరికా, యూకె మొత్తం కలిపినా కూడా కేవలం 19 సెంటర్స్‌లో మాత్రమే ఈ స్పెషల్ ఫార్మాట్ స్క్రీన్స్ ఉన్నాయి. ఈ విజువల్ గ్రాండ్ ఎక్స్‌పీరియన్స్‌ను మిస్ కాకూడదని.. ఐమ్యాక్స్ 70ఎం.ఎం. స్క్రీన్లపైనే చూడాలని డైహార్డ్ ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. ఫలితంగా డిమాండ్ అసాధారణ స్థాయికి చేరుకుంది.

డైరెక్టర్ డెనిస్ విల్లెనెవ్ ఈ చిత్రాన్ని పూర్తిగా 70ఎం.ఎం. ఫిల్మ్‌పై షూట్ చేసి, థియేటర్‌లో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడూ కథా ప్రపంచంలోకి ప్రవేశించినట్టు అనిపించేలా కృషి చేశారు. దాంతో ఇది కేవలం ఒక సినిమాగా కాకుండా గ్లోబల్ ఈవెంట్‌గా మారిపోయింది. టాప్ క్వాలిటీలో మూవీని చూడాలనే ఆడియన్స్ కోరిక, థియేటర్ల కొరత వల్ల టికెట్లు అక్షరాలా దాదాపు లక్ష రూపాయల వరకూ పలుకుతున్నాయి. ఈ భారీ అంచనాలను 'డ్యూన్ 3' అందుకుంటుందో లేదో చూడాలి.

Read Also: రిలీజ్‌కు ముందే పది కోట్ల వ్యూస్‌ టార్గెట్‌!

Read Also: కర్మయోగిని చూశా.. పవన్ కళ్యాణ్‌పై బాబీ పోస్ట్ వైరల్

Updated Date - Apr 08 , 2026 | 07:41 PM