Biker: బాలయ్య తాకిడి తట్టుకోలేక వెనక్కి తగ్గిన శర్వానంద్
ABN , Publish Date - Nov 26 , 2025 | 09:08 PM
యంగ్ హీరో శర్వానంద్ (Sharwanand), మాళవిక నాయర్ (Malavika Nair) జంటగా అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహించిన చిత్రం బైకర్ (Biker).
Biker: యంగ్ హీరో శర్వానంద్ (Sharwanand), మాళవిక నాయర్ (Malavika Nair) జంటగా అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహించిన చిత్రం బైకర్ (Biker). ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించింది. ఇక ఈ సినిమాలో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా డిసెంబర్ 6 న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అందుకు తగ్గట్లే శర్వా కూడా ప్రమోషన్స్ మొదలుపెట్టాడు.
అయితే బైకర్ వచ్చే ముందు రోజే నందమూరి బలకృష్ణ నటించిన అఖండ 2 తాండవం రిలీజ్ కానుంది. బాలయ్య- బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్ననాలుగో సినిమా కావడం.. ఇప్పటికే అఖండ సినిమా హిట్ అవ్వడం.. దాని సీక్వెల్ గా అఖండ 2 తెరకెక్కడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టిన బాలయ్య.. అఖండ 2 పై గట్టి నమ్మకంతో ఉన్నాడు. ఇక బాలయ్య సినిమా అంటే వారం వరకు ఎలాంటి హడావిడి ఉంటుందో అందరికి తెల్సిందే. ఇక ఆ తాకిడి తట్టుకోవడం కష్టమే. దీంతో బాలయ్యతో పోటీ ఎందుకు అని శర్వా బైకర్ ను వాయిదా వేశాడు.
తాజాగా మేకర్స్ బైకర్ వాయిదాను అధికారికంగా ప్రకటించారు. ఒక మంచి సినిమా ప్రేక్షకులకు ఇవ్వడం కోసం చాలా కష్టపడ్డామని, ఇప్పటికీ పడుతున్నామని.. ఎప్పుడు వచ్చినా బైకర్ గుర్తుండిపోయే సినిమా అవుతుందని చెప్పుకొచ్చారు. బైకర్ కేవలం సినిమా మాత్రమే కాదు.. మీకు ఎప్పుడు ఇవ్వలేని అనుభూతిని అందిస్తుంది అంతేకాకుండా బైకర్ 3డి, 4డిఎక్స్ లో రిలీజ్ అవుతుంది అని చెప్పుకొచ్చారు. కొత్త డేట్ ను మాత్రం ఇంకా ప్రకటించలేదు. మరి శర్వా ఎలాంటి పోటీ లేకుండా ఎప్పుడు దిగుతాడో చూడాలి.