‘వారణాసి’ టీమ్‌కు బ్రేక్.. జక్కన్న కీలక నిర్ణయం!
ABN , Publish Date - Apr 18 , 2026 | 07:13 PM
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కలయికలో వస్తున్న ‘వారణాసి’ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గ్లోబల్ లెవల్‌లో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్న ఈ ప్రాజెక్ట్ గురించి తాజాగా ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.
టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు, పాన్ ఇండియా వైడ్‌గా మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అంటే ముందు వరుసలో వచ్చే పేరు ‘వారణాసి’ (Varanasi). సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu), దర్శక ధీరుడు రాజమౌళి (SS Rajamouli) కలయికలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గ్లోబల్ లెవల్‌లో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్న ఈ ప్రాజెక్ట్ గురించి తాజాగా ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. రాజమౌళి సినిమా అంటేనే క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడరు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఏకధాటిగా సాగుతోంది. ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తయిందంటే జక్కన్న ఏ రేంజ్ స్పీడులో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన ఒక భారీ సెట్‌లో మహేష్ బాబుపై ఒక అదిరిపోయే సాంగ్‌ను షూట్ చేస్తున్నారు. ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ నేతృత్వంలో స్టెప్పులు సిద్ధమవుతున్నాయి. సూపర్ స్టార్ మేనరిజమ్స్, జక్కన్న విజన్ తోడైతే ఆ సాంగ్ స్క్రీన్ మీద ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు.
అయితే ఈ సాంగ్ పూర్తి కాగానే జక్కన్న ఒక కీలక నిర్ణయం తీసుకున్నారట. మే నెల మొత్తం షూటింగ్‌కు లాంగ్ బ్రేక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం భానుడి భగభగలే. ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతుండటంతో చిత్రయూనిట్ ఇబ్బంది పడకూడదని రాజమౌళి ఈ నిర్ణయానికి వచ్చారట. నిరంతరం శ్రమిస్తున్న టెక్నీషియన్స్, నటీనటులు కాస్త రిలాక్స్ అవ్వడానికి ఈ గ్యాప్ ఉపయోగపడుతుందని టీమ్ భావిస్తోంది. షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చినంత మాత్రాన రాజమౌళి ఖాళీగా ఉంటారని అనుకుంటే పొరపాటే. కెమెరాకు విశ్రాంతినిచ్చినా, ఎడిటింగ్ టేబుల్ దగ్గర పని మాత్రం వేగంగా సాగనుంది. ఇప్పటికే పూర్తయిన 80 శాతం షూటింగ్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రకాష్ రాజ్‌కు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని సమాచారం. ఇక ప్రియాంక, మహేష్‌కు సంబంధించిన సీన్స్‌తో పాటు కొన్ని యాక్షన్ సీన్స్‌ను తెరకెక్కించాల్సి ఉందట. పూర్తయిన షూటింగ్‌కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఈ గ్యాప్‌లో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ వర్క్స్‌పై రాజమౌళి ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ ముహూర్తాన్ని జక్కన్న టీమ్ ఇప్పటికే లాక్ చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న వారణాసిని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని గట్టిగా డిసైడ్ అయ్యారు. దీని కోసం ఆగస్ట్ నాటికి షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి, ఆ తర్వాత ఆరు నెలల పాటు కేవలం ప్రమోషన్స్ కోసం కేటాయించనున్నారు. లోకల్ నుంచి గ్లోబల్ లెవల్ వరకు ఈ సినిమాను తీసుకువెళ్లడమే రాజమౌళి లక్ష్యం. మహేష్ బాబు మునుపెన్నడూ లేని సరికొత్త లుక్‌లో కనిపించబోతున్న ఈ ‘వారణాసి’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:
పెళ్లికి సిద్ధమైన శృతిహాసన్.. ఆ లక్కీ వరుడు ఎవరో?
విష్ణుప్రియ దారిలోనే మరికొందరు.. ఆ కంటెంట్ కావాలంటే సబ్‌స్క్రైబ్ అవ్వాల్సిందే.
మంగ్లీ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్.. అసలు కథ ఇప్పుడే మొదలైంది!