Varanasi: అనుకున్న టైటిల్ నే దింపిన రాజమౌళి.. మహేష్ లుక్ అయితే బ్లాస్ట్ అంతే
ABN , Publish Date - Nov 15 , 2025 | 07:03 PM
అనుకున్నదే జరిగింది.. అభిమానుల ఆశ ఫలించింది. ఎట్టకేలకు SSMB29 టైటిల్ అధికారికం అయ్యింది. ఎప్పటినుంచో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వారణాసి (Varanasi) అనే టైటిల్ నే రాజమౌళి (Rajamouli)కన్ఫర్మ్ చేశాడు.
Varanasi: అనుకున్నదే జరిగింది.. అభిమానుల ఆశ ఫలించింది. ఎట్టకేలకు SSMB29 టైటిల్ అధికారికం అయ్యింది. ఎప్పటినుంచో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వారణాసి (Varanasi) అనే టైటిల్ నే రాజమౌళి (Rajamouli)కన్ఫర్మ్ చేశాడు. నేడు RFC లో జరుగుతున్న గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్ లో మహేష్ బాబు (Mahesh Babu) లుక్ తో పాటు టైటిల్ ను కూడా రిలీజ్ చేశారు. మహేష్ బాబు.. రక్తం నిండిన దేహంతో నందిపై.. ఒక చేత్తో త్రిశూలం పట్టుకొని.. ముక్కోపిగా వస్తుంటే.. సాక్ష్యాత్తూ శివుడే.. దిగివచ్చునట్లు కనిపిస్తుంది.
మహేష్ లుక్ అయితే అస్సలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఎగురుతున్న జుట్టు.. ఉగ్ర రూపంలో మహేష్ ను చూసి ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇక వారణాసి గురించిన కథ కావడంతో ఆ పేరే యాప్ట్ గా ఉంటుందని జక్కన్న దాన్నే ఫైనల్ చేసినట్లు సమాచారం. మహేష్ ను మునుపెన్నడూ ఈ విధమైన లుక్ లో చూసింది లేదు. మహేష్ విశ్వరూపం.. ఇదే నిదర్శనం అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.