విష్ణుప్రియ దారిలోనే మరికొందరు.. ఆ కంటెంట్ కావాలంటే సబ్‌స్క్రైబ్ అవ్వాల్సిందే.
ABN , Publish Date - Apr 17 , 2026 | 08:00 PM
నటి, యాంకర్ విష్ణుప్రియ దారినే సెలబ్రిటీలు కొందరు ఫాలో అవుతున్నారు. రీసెంట్‌గా విష్ణుప్రియ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర ఫొటోలను షేర్ చేస్తూ, సబ్‌స్క్రిప్షన్ పేరుతో డబ్బు వసూలు చేస్తున్నట్లుగా, విజయవాడకు చెందిన ఏఐఎస్ఎఫ్ నాయకులు కొందరు.. ఆమెపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
నటి, యాంకర్ విష్ణుప్రియ (Vishnu Priya) దారినే సెలబ్రిటీలు కొందరు ఫాలో అవుతున్నారు. రీసెంట్‌గా విష్ణుప్రియ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర ఫొటోలను షేర్ చేస్తూ, సబ్‌స్క్రిప్షన్ పేరుతో డబ్బు వసూలు చేస్తున్నట్లుగా, విజయవాడకు చెందిన ఏఐఎస్ఎఫ్ (AISF) నాయకులు కొందరు.. ఆమెపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. విష్ణుప్రియ అసభ్యకర కంటెంట్‌తో జనాలను ఆకర్షిస్తూ, సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్‌తో భారీగా డబ్బు సంపాదిస్తుందని, సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వాళ్లకి ఎక్స్‌క్లూజివ్ క్లిప్స్ అంటూ, కుర్రాళ్లను తప్పుదోవ పట్టిస్తుందనేది వారి వాదన. ఒక్క విష్ణు ప్రియ మాత్రమే కాదు, సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తే, ఇలాంటి వారు చాలా మందే ఉన్నారు. అవకాశాలు లేక కొందరు, అవసరం కోసం కొందరు.. ఇలా, ఈ మధ్యకాలంలో ఇన్‌కమ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ బాటలో తెలుగు హీరోయిన్లు కూడా కొందరు నడిచేందుకు సిద్ధమవుతున్నట్లుగా సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. సినిమా అవకాశాలు రాకపోతే ఏం చేస్తారు? తన టీమ్‌ని, ఫ్యామిలీని పోషించాలంటే మనీ అవసరం కాబట్టి.. ఇలాంటి పనులకు దిగుతున్నారని, ఇది వారికొక ఆదాయ మార్గంగా మారిందనేది, వీళ్లని ఫాలో అయ్యే వారి వాదన. ఎంత అవకాశాలు లేకపోతే మాత్రం.. ఇంతగా దిగజారాలా? అంతగా అయితే, ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి, పెళ్లి చేసుకుని హాయిగా జీవితాన్ని అనుభవించక, ఎందుకు నిత్యం వార్తల్లో నిలవడం అంటూ.. ఇలాంటి వారికి కొందరు హితబోధ చేస్తున్నారు. నిజమే, అలా కూడా చేయవచ్చు కానీ, ఎవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయనేది? వాళ్లకి మాత్రమే తెలుసు. కాబట్టి పై నుంచి చూసి, జడ్జ్ చేయడం కూడా ఏమంత కరెక్ట్ కాదు. విష్ణు ప్రియనే తీసుకుంటే.. ఈ వ్యవహారం బయటకు రాకముందు ఆమెకు ఉన్న ఫాలోయర్స్ కేవలం వందల్లోనే. కానీ, ఎప్పుడైతే కేసుల వరకు వెళ్లిందో.. సడెన్‌గా ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య వేలకు మారింది. కొన్నిసార్లు ఇలాంటి కేసులు కూడా వారిని మరింత ఫేమస్ చేస్తాయనేది, విష్ణుప్రియ వ్యవహారంలో నిరూపితమైంది.
ఇంతకు ముందు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ రూపంలో వీరికి అదనపు ఆదాయం లభించేది. ఇప్పుడది లేదు. అందుకే, సబ్‌స్క్రిప్షన్ పేరుతో వారి శరీరాన్నే ఆదాయంగా చేసుకోవాలని భావిస్తున్నారు. మరి ఎంతకాలం ఇది సాగుతుందో, పోలీసులు దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది మాత్రం చూడాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
Balakrishna: ‘రూటు’ మార్చిన బాలయ్య.. కొడుకు కథను పక్కన పెట్టి.. తనే ఆ దర్శకుడితో?
Rashmika Mandanna: రష్మికకు పిచ్చెక్కించేశారట.. పోస్ట్ వైరల్!
మంగ్లీకి మరో షాక్ ఇచ్చిన అడ్వొకేట్ సుబ్బారావు.. ఈ ట్విస్ట్ ఏంటయ్యో!