మంగ్లీ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్.. అసలు కథ ఇప్పుడే మొదలైంది!
ABN , Publish Date - Apr 16 , 2026 | 10:50 PM
సింగర్ మంగ్లీ మైక్రో ఫైనాన్స్ చీటింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రమావత్ మధుని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసు మరింత ఆసక్తికరంగా మారింది.
సింగర్ మంగ్లీ (Singer Mangli) మైక్రో ఫైనాన్స్ చీటింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రమావత్ మధు (Ramavath Madhu)ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసు మరింత ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు ఈ కేసులో అటు మంగ్లీ, ఇటు లాయర్ సుబ్బారావు తమ వాదనలు వినిపించారు. సింగర్ మంగ్లీ మీడియా ముందుకు వచ్చి, తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, బాధితులను చూస్తుంటే తనకు కూడా బాధవేస్తోందని తెలిపారు. తన తమ్ముడికి, తనకి అసలు ఎలాంటి సంబంధం లేదని మంగ్లీ మీడియా ముందు చెప్పారు. మరోవైపు లాయర్ సుబ్బారావు మాత్రం ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు, పోలీసులు తన పట్ల బిహేవ్ చేసిన తీరుకు ఆయన బాగా హర్టయ్యారు. అందుకే చాలా సీరియస్‌గా తన పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు హైకోర్టు అడ్వొకేట్స్ కూడా మద్దతు తెలుపుతున్నారు.
ఇలా రోజుకో రకంగా సంచలనం అవుతున్న ఈ కేసులో.. ఇప్పుడు ప్రధాన నిందితుడు రమావత్ మధును పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో.. ఇకపై అసలు కథ మొదలవుతుందనేలా వార్తలు మొదలయ్యాయి. మైక్రో ఫైనాన్స్ పేరుతో దాదాపు రూ. 150 కోట్ల వరకు మధు అండ్ టీమ్ వసూల్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మధుపై ఇప్పటికే సైబరాబాద్‌లో పలు కేసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మైక్రో ఫైనాన్స్ చీటింగ్ వ్యవహారం బయటపడటంతో.. అప్పటి నుంచి మధు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతడి కోసం గాలిస్తున్న సైబరాబాద్ పోలీసులు, చాకచక్యంగా అరెస్ట్ చేసినట్లుగా సమాచారం. ఇక మధు అరెస్ట్‌తో ఈ మొత్తం వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఎంత ఉందనే నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందనేలా వార్తలు మొదలయ్యాయి. అసలు ఈ చీటింగ్ వ్యవహారంలో మంగ్లీ, ఆమె సోదరుడి పాత్ర ఏంటనే విషయం కూడా త్వరలోనే తెలియనుంది. చూద్దాం మరి.. ఇకపై ఈ కేసు ఎటు వైపుకు టర్న్ తీసుకుంటుందో?
ఇవి కూడా చదవండి:
Balakrishna: ‘రూటు’ మార్చిన బాలయ్య.. కొడుకు కథను పక్కన పెట్టి.. తనే ఆ దర్శకుడితో?
Rashmika Mandanna: రష్మికకు పిచ్చెక్కించేశారట.. పోస్ట్ వైరల్!
మంగ్లీకి మరో షాక్ ఇచ్చిన అడ్వొకేట్ సుబ్బారావు.. ఈ ట్విస్ట్ ఏంటయ్యో!