సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఫ్యామిలీ, కామెడీ ఎంటర్‌టైనర్ ‘పురుష:’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

ABN, Publish Date - May 07 , 2026 | 09:22 PM

బత్తుల సరస్వతి సమర్పణలో.. కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తోన్న చిత్రం ‘పురుష:’. పవన్ కళ్యాన్ బత్తుల హీరోగా పరిచయం కాబోతున్న ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.

Purushaha Movie Still

బత్తుల సరస్వతి సమర్పణలో.. కళ్యాణ్ ప్రొడక్షన్స్ (Kalyan Productions) బ్యానర్ పై బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తోన్న చిత్రం ‘పురుష:’ (Purushaha). పవన్ కళ్యాణ్‌ బత్తుల (Pavan Kalyan Battula) హీరోగా పరిచయం కాబోతోన్న ఈ మూవీకి వీరు వులవల (Veeru Vulavala) దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ బత్తులతో పాటు.. సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌ ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, పాటలు, టీజర్ మంచి స్పందనను రాబట్టుకుని.. సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ని మేకర్స్ ప్రకటించారు.


సమ్మర్ స్పెషల్‌గా మే 22న ఈ మూవీని వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నట్లుగా తెలుపుతూ మేకర్స్ ఓ పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇందులో ఆడవాళ్ల ఆధిపత్యం ఎలా ఉంటుందో, మగవాళ్లను ఆడవాళ్లు ఎలా తొక్కేస్తున్నారో అనే విషయాన్ని చాలా ఫన్నీగా చూపించారు. ఫ్యామిలీ అంతా హాయిగా నవ్వుతూ ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉంటుందని, రాబోయే ప్రమోషనల్ కంటెంట్‌తో మరింతగా ఈ సినిమాకు ఆడియెన్స్ ఆకర్షితులవుతారని చిత్రయూనిట్ చెబుతోంది. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించి, మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా గుర్తింపు తెచ్చుకుంటుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. శ్రీ సంధ్య, గబి రాక్, అనైరా గుప్తా, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, పమ్మి సాయి, వి.టి.వి. గణేష్ వంటి వారు ఇతర పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

తెలుగబ్బాయినే పెళ్లి చేసుకుంటా: పాయల్

Peddi Movie: కథ విని, 20 నిమిషాల పాటు మనిషిని కాలేకపోయా- ప్రొడక్షన్ డిజైనర్

Lavanya Tripathi: ఇకపై ప్రెగ్నెంట్ అని తెలిస్తే.. ఆ పని చేయను

‘సన్ రైజర్స్‌’కు సపోర్ట్ చేస్తున్న ఈ భామ ఎవరో గుర్తు పట్టారా?

Updated Date - May 07 , 2026 | 09:22 PM