Purusha Pawan Kalyan: పవన్ కళ్యాణ్ హీరోగా.. ‘పురుష’
ABN , Publish Date - Oct 02 , 2025 | 05:36 PM
కళ్యాణ్ ప్రొడక్షన్స్‌లో బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్న ‘పురుష’తో పవన్ కళ్యాణ్ తెలుగు తెరకు హీరోగా పరిచయం. కామెడీ ఎంటర్టైనర్‌గా రాబోతోంది.
కామెడీ చిత్రాలు ఎప్పటికీ ఎవర్‌గ్రీన్. అలాంటి వినోదాత్మక చిత్రానికి కొత్త రూపు ఇవ్వడానికి కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు భారీ ఎత్తున నిర్మిస్తున్న సినిమా "పురుష. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తెలుగు తెరకు పరిచయం కానున్నారు. దర్శకుడిగా ఉలవల (Veeru Ulavala) తొలి ప్రయత్నమిది. ఆయన ఇంతకు ముందు మళ్లీ రావా, జెర్సీ, మసూద చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు.
"పురుష" ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్. ఇందులో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ ప్రధాన పాత్రల్లో నటించగా, వెన్నెల కిషోర్, వి.టి.వి. గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్ వంటి కమెడియన్స్ తమ ప్రత్యేకమైన హాస్యంతో అలరించనున్నారు. కథానాయికలుగా వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌లు నటిస్తున్నారు. అలాగే గబి రాక్, అనైరా గుప్తా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
తాజాగా ప్రత్యేక గీతంతో చిత్రీకరణ పూర్తి చేసుకుని గుమ్మడికాయ కొట్టేసిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి వెళ్లింది. యూనిట్ సమాచారం ప్రకారం, కొత్త హీరో అయినప్పటికీ పవన్ కళ్యాణ్ తన పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడని తెలుస్తోంది. నిర్మాత బత్తుల కోటేశ్వరరావు ఈ తొలి ప్రాజెక్ట్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ ఎత్తున నిర్మాణం చేశారు. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, ఎడిటింగ్: కోటి, ఆర్ట్ డైరెక్షన్: రవిబాబు దొండపాటి అందిస్తున్నారు.