సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ప్రభాస్ ‘ఫౌజీ’లో నేతాజీగా చేసింది ఎవరో తెలుసా?

ABN, Publish Date - Oct 24 , 2026 | 10:15 AM

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’. తాజాగా ఈ మూవీ నుంచి గ్లింప్స్ విడుదలైన విషయం తెలిసిందే.

Fauzi Netaji Role

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Pan India Rebel Star Prabhas) హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’ (Fauzi). తాజాగా ప్రభాస్ బర్త్‌డేను పురస్కరించుకుని.. ఈ సినిమా నుంచి రిలీజైన క్రేజీ గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్‌ చేస్తోంది. ఈ టీజర్‌తో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. అయితే ఈ గ్లింప్స్‌లో అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించింది ఇద్దరు చారిత్రక వ్యక్తుల రూపాలు. ఒకరు అడాల్ఫ్ హిట్లర్ (Adolf Hitler), మరొకరు భారత స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ (Netaji Subhas Chandra Bose). ఆ విజువల్స్ చూసిన వెంటనే చాలామంది నెటిజన్లు అవి కేవలం AI ద్వారా రూపొందించిన గ్రాఫిక్స్ అనుకున్నారు. కానీ అసలు నిజం అది కాదు. సుభాష్ చంద్రబోస్ పాత్రలో కనిపించింది ఒక అద్భుతమైన నటుడు. ఆయనే మరాఠీ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, దర్శకుడు సుబోధ్ భవే (Subodh Bhave)!


సినిమా రంగంలో బయోపిక్స్ అంటే చాలా కష్టం. ఒక నిజ జీవిత వ్యక్తిని తెరపై జీవింపజేయడం అంత ఆషామాషీ విషయం కాదు. అలాంటిది మరాఠీ చిత్రసీమలో బయోపిక్స్‌కు పెట్టింది పేరు సుబోధ్ భవే. అందుకే ఆయనను సినీ విశ్లేషకులు కింగ్ ఆఫ్ బయోపిక్స్ అని పిలుస్తుంటారు. ఏ చారిత్రక పాత్రనైనా తన నటనతో అలవోకగా ఒంటికి పట్టించుకునే ఊసరవెల్లి లాంటి నటుడు ఆయన. గతంలో ఆయన నటించిన గొప్ప సినిమాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. బాల్ గంధర్వ చిత్రంలో ప్రముఖ రంగస్థల గాయకుడు, నటుడైన నారాయణ్ రావు రాజహంస్ పాత్రలో సుబోధ్ అద్భుతంగా ఒదిగిపోయారు. ‘లోకమాన్య: ఏక్ యుగ్ పురుష్’ సినిమాలో స్వాతంత్ర్య సమరయోధుడు బాలగంగాధర తిలక్ పాత్రను తెరపై సజీవంగా ఆవిష్కరించారు. ఆని... డాక్టర్ కాశీనాథ్ ఘాణేకర్ సినిమాలో మరాఠీ నాటకరంగ దిగ్గజం కాశీనాథ్ ఘాణేకర్ పాత్రలో ఆయన చూపించిన నట విశ్వరూపం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఇలాంటి పవర్‌ఫుల్ ట్రాక్ రికార్డ్ ఉన్న నటుడిని భారత చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడైన నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్ర కోసం ఎంపిక చేయడం హను రాఘవపూడి విజన్‌కు నిదర్శనం.


గ్లింప్స్ విడుదలైన క్షణం నుంచే సోషల్ మీడియాలో సుబోధ్ భవే పేరు మార్మోగిపోతోంది. ఆయన ఆహార్యం, ఆ గంభీరమైన లుక్ చూసిన అభిమానులు ఫిదా అయిపోయారు. ప్రభాస్ పక్కన ఇలాంటి బలమైన నటుడు నటిస్తుండటంతో సినిమాపై హైప్ రెట్టింపైంది. ఈ క్రమంలో మరాఠీ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, ఆయన సన్నిహితులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలో ఆయనను ఇలా చూడటం ఎంతో గర్వంగా ఉందని ప్రశంసిస్తున్నారు. అటు సుబోధ్ భవే కూడా తన సోషల్ మీడియా వేదికగా వస్తున్న శుభాకాంక్షలను షేర్ చేస్తూ తన సంతోషాన్ని పంచుకుంటున్నారు. చరిత్ర నేపథ్యంతో కూడిన ఒక భారీ సినిమాలో ప్రభాస్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, కథలో అత్యంత కీలకమైన మలుపు తిప్పే చారిత్రక పాత్రల్లో ఇలాంటి డెప్త్ ఉన్న నటులను ఎంచుకోవడం ‘ఫౌజీ’ స్థాయిని పెంచేసింది. కేవలం కమర్షియల్ హంగులే కాకుండా, కంటెంట్‌ను ప్రాణంగా భావించే మేకర్స్ తీసుకున్న ఈ నిర్ణయం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించబోతోందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇవి కూడా చదవండి:

ఈసారి ఊహించినట్లుగా ఉండదు.. వేరే కోణంలో ఉంటుంది.. ఏం చేశావ్ గురూజీ?

Sunday TV Movies: అక్టోబ‌ర్ 25, ఆదివారం.. స్మాల్ స్క్రీన్‌పై వచ్చే సినిమాలు

‘వారణాసి’ తర్వాత జక్కన్న మనకు కనబడరా..

Updated Date - Oct 24 , 2026 | 10:15 AM